Raghava Rao Bellamkonda : ‘ప‌ల్లె’కు ప‌ట్టం వ‌సుధైక కుటుంబం

గ్రామీణ సంస్కృతికి ప్రాణం పోస్తున్న ఎన్ఎస్ఆర్

Raghava Rao Bellamkonda : ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాల‌ని, మ‌నం ఎక్క‌డి నుంచి వ‌చ్చామో వాటిని మ‌రిచి పోకూడ‌ద‌ని ఏకంగా త‌న ఊరును పోలిన ప‌ల్లెను సృష్టించాడు.

అంతేనా మ‌నుషుల మ‌ధ్య బంధాల‌ను మ‌రింత పెంచేలా కీల‌క పాత్ర పోషించారు. అత‌ను ఎవ‌రో కాదు రాఘ‌వ రావు బెల్లంకొండ‌(Raghava Rao Bellamkonda). ఉన్న‌త చ‌దువులు చ‌దివినా, ఎన్ని కోట్లు సంపాదించినా మిగిలేది మ‌నం ఏర్ప‌ర్చుకున్న విలువలే అంటారు.

రోజు రోజుకు సాంకేతికత‌, మార్కెట్ మాయ‌జాలంలో కొట్టుకు పోతున్న ఈ ప‌రిస్థితుల్లో రాఘ‌వ‌రావు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అదే ఎన్ఎస్ఆర్ వెంచ‌ర్స్ గా రూపుదిద్దుకుంది.

కుటుంబ వ్య‌వ‌స్థ‌కు ప్రాణం పోసేలా, గ్రామీణ సంస్కృతిని ప్ర‌తిబింబించేలా, బంధాల‌ను మ‌రింత ప‌టిష్టం చేసేలా, ప్ర‌కృతిని, స‌మాజాన్ని క‌లిపేలా తీర్చిదిద్దేందుకు న‌డుం బిగించారు.

ప్ర‌స్తుతం ఆయ‌న ఎన్ఎస్ఆర్ వెంచ‌ర్స్ లో యాజ‌మాన్య భాగస్వామిగా ఉన్నారు. గ‌తంలో విప్రోలో డెలివ‌రీ మేనేజ‌ర్ గా ప‌ని చేశారు. ఈఎంసీ డేటా స్టోరేజ్ సిస్ట‌మ్స్ ఇండియాలో క్వాలిటీ మేనేజ‌ర్ గా ఉన్నారు. 

స‌న్ మైక్రో సిస్ట‌మ్స్ ఇండియా కంపెనీలో స్టాఫ్ ఇంజ‌నీర్ గా ప‌ని చేశారు.  విజ‌య‌వాడ‌లో మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ చ‌దివారు. సింబయాసిస్ లో ఎంబీఏ చ‌దివిన ఆయ‌న మేనేజ్ మెంట్ స్కిల్స్ లో ఆరి తేరారు. 

న‌గ‌రీక‌ర‌ణ వ‌ల్ల ప‌ల్లెత‌నం కోల్పోతున్నామన్న భావ‌న రాఘ‌వ‌రావు బెల్లంకొండ‌ను తొలుస్తూ వ‌చ్చింది. అదే ఆయ‌న‌ను ఎన్ఎస్ఆర్ ను స్థాపించేలా చేసింది. ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ఇచ్చింది.

 కానీ మ‌నం దానికి ఏం ఇస్తున్నాం. పాడు చేస్తున్నాం. అందుకే ఈ మ‌ట్టి గొప్ప‌ది. ఈ మనుషుల స‌మూహం చాలా గొప్ప‌దంటారు.

అంద‌రు క‌లిసి ఒక కుటుంబంగా ఎందుకు ఉండ కూడ‌దు. అలాంటి ప‌ల్లెను పోలిన ప్ర‌పంచం ఎందుకు మ‌నం ఏర్పాటు చేసుకోకూడ‌ద‌నే ఆలోచ‌నే ఈ ఎన్ఎస్ఆర్ వెంచ‌ర్స్. ఇందులో భాగంగా రెండు ప్రాజెక్టుల‌కు శ్రీ‌కారం చుట్టారు.

ఏపీకి చెందిన రాఘ‌వ రావు బెల్లంకొండ క‌ర్ణాట‌క లోని బెంగ‌ళూరు స‌మీపంలో దీనిని నెల‌కొల్పారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆయ‌న దానికి ప్రాణం పోశారు. మ‌నం దానిని ద‌ర్శిస్తే అలౌకిక ఆనందాన్ని పొందుతాం. 

అద్వితీయ‌మైన సంతోషానికి లోన‌వుతాం. ప‌చ్చ‌ని చెట్లు, ప్ర‌కృతికి ప్ర‌తిరూపం ఉండేలా తీర్చిదిద్దారు. ఇక్క‌డంతా స్థానికంగా దొరికే వాటితోనే, ఇక్క‌డి మ‌నుషుల‌తోనే అంద‌మైన గృహాల‌ను నిర్మిస్తున్నారు. 

ఊరుమ్మ‌డి సంస్కృతిని తీసుకు రావ‌డం, ప్ర‌కృతిని ప‌రిర‌క్షించ‌డం, ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడు కోవ‌డం త‌మ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు రాఘ‌వ రావు బెల్లంకొండ‌(Raghava Rao Bellamkonda). 

హానిక‌ర‌మైన ఎరువుల‌ను వాడ‌డం అంటూ ఉండ‌దు. ఎటు చూసినా ప‌చ్చ‌ని చెట్లు, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం. అంద‌రూ ఒకే కుటుంబంలా వ‌సుధైక భావ‌న‌తో క‌లిసి మెలిసి ఉండ‌డం చేస్తున్నారు.

ఆయ‌న చేస్తున్న కృషికి ఎన్నో పుర‌స్కారాలు , అవార్డులు అందుకున్నారు. కానీ ఇవేవీ ఇవ్వ‌ని సంతోషం త‌న‌కు ఈ క‌ల‌ల సౌధం చూస్తే క‌లుగుతుందంటారు. వీలైతే మీరు ఎన్ఎస్ఆర్ ప్రాజెక్టును సంద‌ర్శించండి.

ఆయ‌న‌తో సంభాషించండి. వీలైతే మీరూ భాగ‌స్వామ్యులు కండి. కోట్లున్నా దొర‌క‌ని ప్రశాంతత ఇక్క‌డ ల‌భిస్తుంద‌నడంలో సందేహం లేదు. ఇలాంటి ప్రాజెక్టులు మ‌నకు కూడా ఉంటే బావుండేది క‌దూ.

Also Read : గాంధీ విలువ‌లు నిల‌బ‌డేలా చేశాయి

1 Comment
  1. Raghava says

    Thank you for telling our story to your viewers, in your platform..

Leave A Reply

Your Email Id will not be published!