Raghuveera Reddy : అజ్జాతం వీడిన ర‌ఘువీరా

మాజీ మంత్రి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Raghuveera Reddy : కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ పీసీసీ చీఫ్‌, మాజీ మంత్రి ర‌ఘువీరా రెడ్డి(Raghuveera Reddy) మ‌న‌సు మార్చుకున్నారు. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాజ‌కీయ అజ్ఞాతం వీడుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయ రంగంలో మేరున‌గ ధీరుడిగా, అజాత శ‌త్రువుగా పేరు పొందారు.

పీసీసీ చీఫ్ గా కూడా ప‌ని చేశారు. మంత్రిగా త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రిచారు. రాయ‌ల‌సీమ రాజ‌కీయాల‌లో త‌న‌దైన పాత్ర పోషించారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మంత్రివ‌ర్గంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా పేరు పొందారు. ఆతిథ్యం ఇవ్వ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి.

నీల‌కంఠాపురం ర‌ఘువీరా రెడ్డిగా పేరు పొందారు. ఎవ‌రికి ఏ ఆప‌ద వ‌చ్చినా, సాయం అడిగినా ముందుంటార‌నే ప్ర‌చారం ఉంది. రాజ‌కీయాల‌కు అతీతంగా , పార్టీల‌కు అతీతంగా అంద‌రూ ఆయ‌న‌ను ర‌ఘ‌న్న అని పిలుచుకుంటారు. ఇక అనంత‌పురం జిల్లా మ‌డ‌క‌శిర‌కు చెందిన ర‌ఘువీరారెడ్డి తాజాగా క‌ర్ణాట‌క లో త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల వేదిక‌ను పంచుకోనున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ర‌ఘువీరా రెడ్డి కొంత కాలం నుంచి పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. ఈ మేర‌కు రాజ‌కీయ అజ్ఞాతం వీడుతున్నాన‌ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీ హై క‌మాండ్ ఆదేశాల మేర‌కు తాను క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. రాహుల్ గాంధీకి అండ‌గా ఉండాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

Also Read : క‌బ్జాలు..ఫామ్ హౌస్ లు అబ‌ద్దం

Leave A Reply

Your Email Id will not be published!