Raghunandan Rao : మహబూబ్ నగర్ జిల్లా – బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని తాను ఖండిస్తున్నానని స్పష్టం చేశారు బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. సోషల్ మీడియా వేదికగా తమ పార్టీకి చెందిన వ్యక్తి దాడి చేశాడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ లో జరిగిన సభలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు రఘునందన్ రావు.
Raghunandan Rao Serious Comments
ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కోడి కత్తి డ్రామాలు చేయడం మంచి పద్దతి కాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే.
హత్యా రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడడం మంచిది కాదన్నారు రఘునందన్ రావు(Raghunandan Rao). ఎన్నికల వేళ ఇలాంటి చౌకబారు చర్యలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందంటూ ఆరోపించారు. తనకు కూడా ఎంపీ పరిచయమేనని, ఏ పార్టీకి చెందిన వారైనా దాడులకు దిగడాన్ని తాను సమర్థించ బోనంటూ స్పష్టం చేశారు బీజేపీ ఎమ్మెల్యే.
ఎవరు ఏమిటి అనే దానిపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వెంటనే కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నానని అన్నారు రఘునందన్ రావు.
Also Read : CM KCR Visit : ఎంపీకి పరామర్శ గన్ మెన్ కు ప్రశంస
