Raghuram Rajan : సంక్షోభంలో బ్యాంకింగ్ వ్యవస్థ – రాజన్
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్
Raghuram Rajan : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్(Raghuram Rajan) సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఆయన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మాజీ చీఫ్ గా కూడా ఉన్నారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక మందగమనాన్ని ముందుగానే హెచ్చరించారు. ఇదే విషయాన్ని 2008లో వెల్లడించారు. శుక్రవారం మరోసారి ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అమెరికాలో రెండు ప్రధాన బ్యాంకులు దివాళా తీశాయి.
ఆర్థిక రంగంలో చోటు చేసుకున్న విపత్కర పరిణామాలు అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్నాయి. దీనిని సాకుగా తీసుకున్న ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, మీడియా సంస్థలు వేలాది మందిపై వేటు వేశాయి. ఇదిలా ఉండగా రాబోయే రోజుల్లో భారత దేశంలోని బ్యాంకులు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ , క్రెడిట్ సూయిస్ లో సమస్యలు ఆర్థిక వ్యవస్థలో లోతైన అంతర్లీన సమస్యలు సూచిస్తున్నాయని తెలిపారు రఘురామ్ రాజన్. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ మరింత గందరగోళానికి గురయ్యే అవకాశం లేక పోలేదని హెచ్చరించారు. ఒక దశాబ్దం పాటు ఈజీ మనీ ,సెంట్రల్ బ్యాంకుల నుండి లిక్విడిటీ వెల్లువెత్తిందని పేర్కొన్నారు మాజీ చీఫ్ ఎకానమిస్ట్(Raghuram Rajan).
Also Read : వెల్లువలా జడ్జీలపై ఫిర్యాదులు – రిజిజు