Rahul Bus Yatra : 28 నుంచి రాహుల్ బ‌స్సు యాత్ర‌

ప్ర‌క‌టించిన టీపీసీసీ

Rahul Bus Yatra : తెలంగాణ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కీల‌కంగా మార‌నున్నారు. ఈసారి పార్టీ ఎలాగైనా స‌రే ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్లాన్ చేశారు. ఇప్ప‌టికే తొలి విడ‌త బ‌స్సు యాత్ర చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వివిధ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌తో ముచ్చ‌టించారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

Rahul Bus Yatra Will be Started in Telangana

ఇప్ప‌టికే తొలి విడ‌త బ‌స్సు యాత్ర ముగిసింది. ప్ర‌స్తుతం టీపీసీసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఎన్నిక‌ల క్యాంపెయిన్ లో భాగంగా రెండో విడ‌త కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో రెండో విడ‌త బ‌స్సు యాత్ర కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది టీపీసీసీ.

ఈ మేర‌కు రాహుల్ బ‌స్సు యాత్ర అక్టోబ‌ర్ 28 నుంచి న‌వంబ‌ర్ 1 వ‌ర‌కు రెండో విడ‌త కొన‌సాగుతుంద‌ని పేర్కొంది. ఈ యాత్ర‌లో రాహుల్ గాంధీ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయ‌కుల‌తో పాటు క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య హాజ‌ర‌వుతార‌ని వెల్ల‌డించింది టీపీసీసీ.

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో 119 సీట్ల‌కు గాను కాంగ్రెస్ ఎన్నిక‌ల స్క్రీనింగ్ క‌మిటీ తొలి విడ‌తలో 55 సీట్ల‌ను ఖ‌రారు చేసింది. రేపు లేదా ఎల్లుండి 60 సీట్ల‌కు సంబంధించి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు టాక్.

Also Read : YSRCP Bus Yatra : 26 నుంచి వైసీపీ బ‌స్సు యాత్ర

Leave A Reply

Your Email Id will not be published!