Rahul Convoy Stopped : రాహుల్ గాంధీ టూర్ ఉద్రిక్తం
అడ్డుకున్న పోలీసులు
Rahul Convoy Stopped : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కాన్వాయ్ ని వెళ్లనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు. గురువారం రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాకు చేరుకున్నారు. అక్కడి నుంచి మణిపూర్ లోని చురచంద్ పూర్ జిల్లాలో పర్యటించేందుకు బయలు దేరారు. దీంతో ఆయనను వెళ్లనీయకుండా కాన్వాయ్ ను అడ్డుకున్నారు పోలీసులు. గత కొంత కాలంగా మణిపూర్ మండుతోంది. ఇప్పటి వరకు 100 మందికి పైగా జాతి ఆధిపత్య పోరులో చని పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఆపై 60 వేల మంది నిరాశ్రయులుగా మారారు.
ఇదే సమయంలో 10 వేల మందికి పైగా బలగాలు మోహరించాయి. కానీ ఇప్పటి వరకు మణిపూర్ కంట్రోల్ కాలేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నెలకొని ఉంది. ఇప్పటి వరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సైతం మణిపూర్ ను సందర్శించారు. ఆయా వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేక పోయింది.
ఇంకా అగ్నిగుండంగా మారింది. ఇంత మారణ హోమం జరిగినా ఇప్పటి వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించిన పాపాన పోలేదని , కనీసం నోరు మెదపలేదని ధ్వజమెత్తారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi). చురచంద్ పూర్ కు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. కాన్వాయ్ ను అడ్డు కోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది కాంగ్రెస్ పార్టీ.
Also Read : Procter And Gamble : ప్రోక్టర్..గ్యాంబుల్ రూ. 2 వేల కోట్ల ఇన్వెస్ట్