Rahul Gandhi : జ‌న గ‌ర్జ‌న స‌భ‌కు రాహుల్ గాంధీ

ఖ‌మ్మంలో పీపుల్స్ మార్చ్ ముగింపు స‌భ

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఖ‌మ్మంలో జూలై 2న ఆదివారం భారీ బ‌హిరంగ స‌భ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఏర్పాట్లలో మునిగి పోయారు పార్టీ శ్రేణులు. ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా స‌రే అధికారంలోకి రావాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర చేప‌ట్టారు. ఈ యాత్ర ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రారంభ‌మైంది. ఖ‌మ్మం జిల్లాతో జూలై 1తో పూర్త‌వుతుంది.

ఈ సంద‌ర్బంగా వేలాది మంది ప్ర‌జ‌ల‌ను భ‌ట్టి విక్ర‌మార్క యాత్ర‌లో భాగంగా క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. వారందించిన సూచ‌న‌లు, స‌ల‌హాలు స్వీక‌రించారు. అభిప్రాయాల‌ను నోట్ చేసుకున్నారు. పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర స‌క్సెస్ కావ‌డంతో ముగింపు స‌భ‌ను ఖ‌మ్మంలో చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది కాంగ్రెస్ పార్టీ.

ఈ మేర‌కు ఆ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు. అంత‌కు ముందు సీఎల్పీ నేత‌తో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డితో చ‌ర్చించారు. ఈ ముగింపు స‌భ‌కు జ‌న గ‌ర్జ‌న స‌భ అని పేరు పెట్టారు. ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) స‌భ‌కు రానున్నారు. ఈ విష‌యాన్ని ఠాక్రే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా ప‌లువురు నాయ‌కులు రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు స‌మాచారం.

Also Read : Shatrucharla Vijaya Rama Raju : బాబు సీఎం కావ‌డం ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!