Rahul Gandhi : దీరోదాత్తుడు బిర్సా ముండా
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాళి
Rahul Gandhi : ఆదివాసీల ఆరాధ్య దైవంగా భావించే స్వాతంత్ర సమర యోధుడు వీర్ బిర్సా ముండా వర్దంతి సందర్భంగా యావత్ భారతమంతా నివాళులు అర్పిస్తోంది.
ఆ యోధుడు చేసిన పోరాటాన్ని స్మరించుకుంటోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) బిర్సా ముండాకు నివాళి అర్పించారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. నీళ్లు- భూమి – అడవిని కాపాడేందు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దీరోదాత్తుడు అంటూ ప్రశంసించాడు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
ఇదిలా ఉండగా బీహార్ నుంచి ఏర్పడింది జార్ఖండ్ రాష్ట్రం. బిర్సా ముండా జయంతి సందర్భంగా అధికారికంగా ఆవిర్భవించింది. అందుకే ఆయన జయంతి రోజున రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తుంది ఆ రాష్ట్రం.
స్వాతంత్ర ఉద్యమానికి, సామాజిక సామరస్యానికి బిర్సా ముండా పాటుపడ్డారు. సమాజంలోని అణగారిని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడ్డాడు. జార్ఖండ్ లో 1875లో పుట్టాడు బిర్సా ముండా.
ఆనాటి ఆంగ్లేయుల పాలనను సవాల్ చేశాడు. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా గిరిజన, ఆదివాసీలను సమీకరించాడు. వారిని పోరాట వీరులుగా తయారు చేశాడు బిర్సా ముండా. కేవలం 25 ఏళ్ల వయస్సులో ఆంగ్లేయుల కస్టడీలో మరణించాడు.
ఈ దేశం మరిచి పోని యోధులలో బిర్సా ముండా ఒకరు. ఉరి కొయ్యలను ముద్దాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ తో పాటు బిర్సా ముండా కూడా ఎల్లప్పటికీ సూర్య చంద్రులు ఉన్నంత కాలం బతికే ఉంటారు.
Also Read : లంకకు సాయంపై భారత్ కు చైనా కితాబు