Rahul Gandhi : కాశ్మీర్ లో కాలు మోపనున్న రాహుల్ గాంధీ
జమ్మూలో పూర్తయిన భారత్ జోడో యాత్ర
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర కల్లోలంలో కొనసాగుతోంది. ఈ యాత్ర బనిహాల్ నుండి తిరిగి ప్రారంభం అవుతుంది. యాత్రలో భాగంగా శుక్రవారం కాశ్మీర్ లోకి ప్రవేశించనుంది. ఇవాళ రాహుల్ కు జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జేజేలు పలికారు.
ఇప్పటి దాకా ఎందరో నాయకులు వచ్చారని కానీ వారి చుట్టూ భద్రతా వలయమేనని కానీ రాహుల్ గాంధీ మాత్రం అత్యంత ప్రత్యేకమైన నాయకుడని కితాబు ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ వాసులు. ఇవాళ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు రాహుల్ గాంధీ.
భారీ ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న భారత్ జోడో యాత్ర జనవరి 30న శ్రీనగర్ లో ర్యాలీతో ముగుస్తుంది. 31న బహిరంగ సభ చేపట్టనున్నారు. దేశంలోని 24 పార్టీలకు, జాతీయ ప్రతినిధులు, ప్రముఖులు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలికింది.
ఇవాళ భారత దేశంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా కాశ్మీర్ లోని హైవే టౌన్ బనిహాల్ నుండి తిరిగి ప్రారంభం అవుతుంది. భారత్ జోడో యాత్ర పునః ప్రారంభం కానుంది. నిన్న చేయలేని దూరాన్ని పూర్తి చేస్తామని చెప్పారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి , కమ్యూనికేషన్స్ ఇన్ ఛార్జి జైరాం రమేష్ .
జమ్మూ లోని వివిధ జిల్లాల ద్వారా 90 కిలోమీటర్ల మేర సాగిందని స్పష్టం చేశారు.
Also Read : ఢిల్లీ మేయర్ ఎన్నికపై ఆప్ కోర్టుకు