Rahul Gandhi : అపూర్వ ఆద‌ర‌ణ అనూహ్య స్పంద‌న

కొన‌సాగుతున్న రాహుల్ భార‌త్ జోడో యాత్ర‌

Rahul Gandhi :  కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న భార‌త్ జోడో యాత్ర‌కు అపూర్వ‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఎక్క‌డ చూసినా పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి స్పంద‌న ల‌భిస్తుండ‌డంతో కాంగ్రెస్ పార్టీలో మ‌రింత జోష్ పెరిగింది.

134 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన ఆ పార్టీ గ‌త కొంత కాలంగా తీవ్ర‌మైన ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటోంది. గ‌తంలో జ‌రిగిన దేశ వ్యాప్త ఎన్నిక‌ల్లో దారుణ‌మైన ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది.

3,570 కిలోమీట‌ర్ల మేర ఈ పాద‌యాత్ర కొన‌సాగుతుంది. క‌న్యాకుమారి నుంచి ప్రారంభ‌మైన ఈ భార‌త్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) 150 రోజుల పాటు జ‌రుగుతుంది.

ఈ యాత్ర కాశ్మీర్ వ‌ర‌కు కొన‌సాగుతుంది. ప్ర‌తి రోజూ ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు రాహుల్ గాంధీ ఈ యాత్ర‌లో పాల్గొంటారు. భారీ ఎత్తున జ‌నం, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, నేత‌లు త‌ర‌లి వ‌స్తున్నారు.

రాహుల్ గాంధీకి సంఘీభావంగా త‌మ మ‌ద్ద‌తు తెలియ చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా కేంద్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డుగుతున్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .

ఇదే స‌మ‌యంలో మోదీకి వ్య‌తిరేకంగా రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌ను నిర‌సిస్తూ త‌మిళ‌నాడుకు చెందిన రైతులు ఆందోళ‌న చేప‌ట్టారు జంత‌ర్ మంత‌ర్ లో . ఆనాడు పాల్గొన్న అన్న‌దాత‌ల‌తో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు.

వారికి ఈ సంద‌ర్బంగా భ‌రోసా ఇచ్చారు. రేప‌టి దాకా త‌మిళ‌నాడులోనే గాంధీ యాత్ర సాగుతుంది. సెప్టెంబ‌ర్ 11న కేర‌ళ రాష్ట్రంలోని క‌లియిక్క‌విలాలోకి భార‌త్ జోడో యాత్ర ప్ర‌వేశిస్తుంది.

కాగా రాహుల్ గాంధీతో పాటు రాజ‌స్తాన్, ఛ‌త్తీస్ గ‌డ్ సీఎంలు అశోక్ గెహ్లాట్ , భూపేష్ బ‌ఘేల్ పాల్గొన్నారు.

Also Read : రాజ‌సౌధంలో ఉన్నా రాణిగా రాణింపు

Leave A Reply

Your Email Id will not be published!