Rahul Gandhi: పోలీసు కానిస్టేబుల్‌ ను ఢీకొట్టిన రాహుల్ గాంధీ కారు

పోలీసు కానిస్టేబుల్‌ ను ఢీకొట్టిన రాహుల్ గాంధీ కారు

Rahul Gandhi : బిహార్‌లోని నవాడాలో రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ లో అపశ్రుతి చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న రోడ్డులో ఓపెన్ టాప్ జీపులో రాహుల్ ప్రయాణిస్తుండగా ఆయన వాహనం ఒక పోలీసు కానిస్టేబుల్‌ను ఢీకొంది. వెంటనే పోలీసు సిబ్బంది, రాహుల్ గాంధీ (Rahul Gandhi) మద్దతుదారులు ఆ వాహనాన్ని వెనక్కి నెట్టడం ద్వారా గాయపడిన కానిస్టేబుల్‌ను కాపాడారు. యాత్రకు భద్రత కల్పించే బాధ్యతల్లో పోలీసు కానినిస్టేబుల్ ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Rahul Gandhi Car Accident

పోలీసును రాహుల్ వాహనం ఢీకొన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కారు వీల్స్ కింద నుంచి బయటపడగానే ఆ పోలీసు కుంటుతూ అక్కడి నుంచి వెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే ఓపెన్ టాప్ జీపుపై ఉన్న రాహుల్ గాంధీ ఒక వాటర్ బాటిల్‌ను తన మద్దతుదారులకు ఇచ్చి గాయపడిన వ్యక్తికి సాయపడాల్సిందిగా కోరారు. నేరుగా ఆయనను కలుసుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

క్రష్ జనతా యాత్ర – బీజేపీ ఎద్దేవా

రాహుల్ గాంధీ తన వెహికల్‌తో పోలీసు కానిస్టేషల్‌ను తొక్కించారంటూ బీజేపీ ఈ ఘటనపై విమర్శలు గుప్పించింది. ఇది ‘క్రష్ జనతా యాత్ర’ అని పార్టీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. పోలీసు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన పరిస్థితి ఏమిటో కూడా రాహుల్ కనుక్కోలేదని విమర్శించారు. రాహుల్ చేపట్టిని ఓటర్ అధికార్ యాత్ర వజీర్‌గంజ్‌లో ప్రారంభమై ప్రస్తుతం నవడా మీదుగా వెళ్లోంది. సెప్టెంబర్ 1న పాట్నాలో ఈ యాత్ర ముగియనుంది.

Also Read : Mahindra Group: బీజేడీ ఎంపీకి మహీంద్రా ఉద్యోగి హత్యాచార బెదిరింపులు

Leave A Reply

Your Email Id will not be published!