Rahul Gandhi Disagree : స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ వ్యాఖ్య‌లు స‌రికాదు

డిగ్గీ రాజా కామెంట్స్ పై రాహుల్ ఫైర్

Rahul Gandhi Disagree : పుల్వామా, స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ పై ఇప్ప‌టి వ‌ర‌కు నివేదిక ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు మ‌ధ్య ప్ర‌దేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై భార‌తీయ జ‌న‌తా పార్టీ తీవ్రంగా స్పందించింది. దీనిపై కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ స్పందించారు.

తాను దిగ్విజ‌య్ సింగ్ చేసిన కామెంట్స్ తో విభేదిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఒకే పార్టీలో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న క‌మ్యూనికేష‌న్ గ్యాప్ కొంత ఇబ్బందిక‌రంగా మారే ఛాన్స్ ఏర్ప‌డింది. ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర మంగ‌ళ‌వారం జ‌మ్మూ కాశ్మీర్ లో కొన‌సాగుతోంది.

ప్ర‌ముఖ న‌టి ఊర్మిలా మటోండ్క‌ర్ రాహుల్ యాత్ర‌లో పాల్గొన్నారు. ఆయ‌న‌కు సంఘీభావం తెలిపారు. ప్ర‌స్తుతం దిగ్విజ‌య్ సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. పుల్వామా, స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ పై ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతూ సీనియ‌ర్ నేత , మాజీ సీఎం డిగ్గీ రాజా చేసిన వ్యాఖ్యాల‌తో కాంగ్రెస్ పార్టీ ఏకీభ‌వించ‌ద‌ని(Rahul Gandhi Disagree) పేర్కొన్నారు.

ఆ కామెంట్స్ దిగ్విజ‌య్ సింగ్ వ్య‌క్తిగ‌త‌మైన‌వ‌ని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఆయ‌న అభిప్రాయాల‌తో తాము విభేదిస్తున్నామ‌ని, పార్టీ అలా అనుకోవ‌డం లేద‌ని చెప్పారు. జ‌మ్మూలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ మాట్లాడారు. కాగా ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌లు పార్టీకి ఒక ర‌కంగా మేలు చేకూర్చేలా ఉన్నా డిగ్గీ రాజాకు న‌ష్టం క‌ల‌గించేలా ఉన్నాయ‌న‌డంలో త‌ప్పు లేదు.

Also Read : రాహుల్ రాజీనామా ఆద‌ర్శ‌నీయం – పైల‌ట్

Leave A Reply

Your Email Id will not be published!