Rahul Gandhi : పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాలి

పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కాంగ్రెస్ (Congress)అగ్ర నేత‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇవాళ బెంగ‌ళూరులో (Bengaluru) క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీ కీల‌క స‌మావేశంలో పాల్గొన్నారు.

ఈ స‌మావేశానికి పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ బాధ్యులు హాజ‌ర‌య్యారు. వీరితో పాటు కేపీసీసీ (KPCC) చీఫ్ డీకే శివ‌కుమార్ , మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య కూడా రాహుల్ గాంధీ(Rahul Gandhi) వెంట ఉన్నారు.

అంత‌కు ముందు రాహుల్ గాంధీ కేపీసీసీ (KPCC) చీఫ్ కుర్చీలో ఆసీనుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా డీకే శివ‌కుమార్ ను అభినందించారు. పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కృషి చేయాల‌ని సూచించారు.

అనంత‌రం క‌ర్ణాట‌క (Karnataka) కాంగ్రెస్  (Congress) విస్తృత స్థాయి స‌మావేశంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కొలువు తీరిన బీజేపీ (BJP) ప్ర‌భుత్వాలు ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తున్నాయ‌ని ఆరోపించారు.

ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేయాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌న్నారు. ఇప్ప‌టికే జాతీయ క‌మిటీ తీసుకున్న నిర్ణ‌యాల‌కు అనుగుణంగా ఆందోళ‌న‌లు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు.

రాష్ట్రంలో చోటు చేసుకున్న హిజాబ్ వివాదం, దేవాల‌యాల ఆవ‌ర‌ణ‌ల్లో హిందూయేత‌ర వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటుండ‌డం గురించి కేపీసీసీ (KPCC) చీఫ్ డీకే శివ‌కుమార్ రాహుల్ గాంధీకి (Rahul Gandhi)వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

అంతే కాకుండా ఆంక్ష‌లు విధించ‌డం, హ‌లాల్ మాంసాహారం వంటి అంశాల‌పై రాష్ట్రం చ‌ర్చిస్తున్న త‌రుణంలో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఆయ‌న ప‌ర్య‌ట‌న క‌ర్ణాట‌కలో వ‌చ్చే ఏడాద 2023లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో టూర్ చేశార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : చండీగఢ్ కోసం పంజాబ్ తీర్మానం

Leave A Reply

Your Email Id will not be published!