Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేసులో ఉన్నా – రాహుల్

వాయ‌నాడు ఎంపీ షాకింగ్ కామెంట్స్

Rahul Gandhi :  కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) షాకింగ్ కామెంట్స్ చేశారు. వ‌చ్చే నెల అక్టోబ‌ర్ 17న 134 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా అంత‌ర్గ‌తంగా ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది.

పార్టీలో ప్ర‌జాస్వామ్యం లేకుండా పోయింద‌ని, ఎన్నిక‌లు స‌జావుగా సాగేలా చూడాల‌ని ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు డిమాండ్ చేశారు. ప్ర‌ధానంగా తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

ఇదే స‌మ‌యంలో రాహుల్ గాంధీని ప్ర‌శంసించారు. అయితే కొంత అనుమానం వ్య‌క్తం చేస్తూనే తాను కూడా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు.

ఈ విష‌యాన్ని బ‌హిరంగంగా వ్య‌క్తం చేయ‌క పోయిన‌ప్ప‌టికీ కేర‌ళ రాష్ట్రంలో పేరొందిన మాతృభూమి ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థ‌నం రాశారు. ఇందులో అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

తాను కూడా బ‌రిలో ఉంటాన‌ని పేర్కొన్నారు. అయితే శ‌శి థ‌రూర్(Sasi Tharoor) చేసిన ప్ర‌తిపాద‌న‌ను తాను కూడా స‌పోర్ట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు కేర‌ళ కాంగ్రెస్ పార్టీ చీఫ్. ఇందులో అభ్యంత‌రం చెప్పాల్సిన ప‌ని ఏముంద‌ని ప్ర‌శ్నించారు.

ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు పార్టీ మాజీ చీఫ్ సీరియ‌స్ గా స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి తాను పూర్తిగా దూరంగా లేన‌ని స్ప‌ష్టం చేశారు. కాగా రాహుల్ గాంధీ తాజాగా చేసిన ఈ కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : మిస్సైల్స్ ప్ర‌యోగిస్తే రైఫిల్ తో అడ్డుకున్నా

Leave A Reply

Your Email Id will not be published!