Rahul Gandhi Visits : గిరిజన కుటుంబానికి రాహుల్ భరోసా
వాయనాడ్ నియోజకవర్గంలో టూర్
Rahul Gandhi Visits : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi Visits) సోమవారం లోక్ సభ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన గిరిజన కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. ఇటీవల కేరళ లోని కోజికోడ్ మెడికల్ కాలేజీ సమీపంలో శవమై కనిపించాడు గిరిజనుడు. సదరు బాధిత ఇంటికి స్వయంగా రాహుల్ గాంధీ వెళ్లారు.
ఆ చని పోయిన వ్యక్తి విశ్వనాథన్. ఆయన వయస్సు 46 ఏళ్లు. ఫిబ్రవరి 11న కోజికోడ్ లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రి సమీపంలో ఉరి వేసుకుని కనిపించాడు. ఆదివారం రాత్రి కోజికోడ్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు రాహుల్ గాంధీ. ఉదయమే పార్టీ నాయకులతో కలిసి వయనాడ్ జిల్లాలోని విశ్వనాథన్ ఇంటికి వెళ్లారు. వారిని ఓదార్చారు రాహుల్ గాంధీ.
లోక్ సభలో వాయనాడు నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక విశ్వనాథన్ కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు. వారి బాధలు విన్నారు. వారు చేసిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్నారు. తాను ఆదుకుంటానని హామీ ఇచ్చారు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi Visits) . ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్న విశ్వనాథన్ కనిపించడం లేదంటూ కేసు నమోదైంది.
ఆ తర్వాత 11న శవమై కనిపించాడు. దీని వెనుక ఏదో మిస్టరీ దాగి ఉందని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. ఫిబ్రవరి 9న విశ్వనాథన్ ను కొందరు వేధించారని , ఆ తర్వాత అతడు కనిపించకుండా పోయాడని వాపోయారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత తొలి పర్యటన ఇదే.
Also Read : అధికారం శాశ్వతం కాదు – అజిత్ పవార్
The family of Vishwanathan, who was discovered hanging outside the medical college hospital in Kozhikode, was visited by @RahulGandhi.
We demand a thorough inquiry. The family of Viswanathan should get justice.#RahulGandhi #Kerala #MobJustice pic.twitter.com/6qAGUkEE3H
— Netta D'Souza (@dnetta) February 13, 2023