Rahul Gandhi : అనుమ‌తిస్తే పార్ల‌మెంట్ లో మాట్లాడ‌తా

ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ

Rahul Gandhi Parliament : ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ గురువారం పార్ల‌మెంట్ కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ భార‌త దేశం గురించి చుల‌క‌నగా మాట్లాడారంటూ , బేష‌ర‌తుగా పార‌ల్మెంట్ లో క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తూ వ‌చ్చారు బీజేపీకి చెందిన మంత్రులు. దీనిపై తీవ్రంగా స్పందించారు రాహుల్ గాంధీ.

బీజేపీ వాళ్ల కంటే ప్ర‌ధానంగా న‌రేంద్ర మోదీ కంటే తాను దేశం ప‌ట్ల భ‌క్తి క‌లిగి ఉన్నాన‌ని పేర్కొన్నారు. దేశాన్ని తాను ఏనాడూ అవ‌మానించ లేద‌న్నారు. బీజేపీ చేస్తున్న ఆరోప‌ణ‌లు అన్నీ అబ‌ద్ద‌మేన‌ని కొట్టి పారేశారు రాహుల్ గాంధీ. వారు గ‌నుక అనుమ‌తి ఇస్తే తాను పార్ల‌మెంట్ లో మాట్లాడ‌తాన‌ని , క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పారు.

లోక్ స‌భ ప్రాంగ‌ణ‌లోకి వెళుతుండ‌గా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎలాంటి భార‌త వ్య‌తిరేక ప్ర‌సంగం చేయ‌లేద‌న్నారు. భార‌త దేశంలో ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ఉందంటూ రాహుల్ గాంధీ(Rahul Gandhi Parliament) కామెంట్స్ చేశారంటున్నారు కేంద్ర మంత్రులు. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని, లేక పోతే ఆయ‌నపై జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు.

ఈ మొత్తం వ్య‌వ‌హారానికి సంబంధించి రెండు స‌భ‌లు వాయిదా ప‌డ్డాయి. మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి గౌతం అదానీకి మ‌ధ్య ఉన్న బంధం తేల్చాల‌ని డిమాండ్ చేసింది. దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నిద్ర పోతున్నారంటూ ఎద్దేవా చేశారు.

Also Read : రాహుల్ ది వ్య‌తిరేక శ‌క్తుల భాష

Leave A Reply

Your Email Id will not be published!