Rahul Gandhi : త్వరలో రాహుల్ గాంధీ పాదయాత్ర
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
Rahul Gandhi : రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకు రావడం, పార్టీని మరింత బలోపేతం చేయడం, ఆక్టోపస్ లా అల్లుకు పోయిన బీజేపీని ఎదుర్కోవడం అధికారంలోకి రావడం అనే దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
ఇందులో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేపట్టనున్నారు అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) . రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నవ్ సంకల్ప్ చింతన్ శివర్ సందర్భంగా ఈ పాదయాత్ర చేపట్టున్నట్లు సమాచారం.
ఈ యాత్ర గురించి శివిర్ లో చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది చివర్లో ఇది ప్రారంభయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రజానుకూల అజెండాను ముందుకు తెచ్చేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను , ప్రజల కష్టాలను ఎత్తి చూపేందుకు రాష్ట్ర నాయకులు ప్రతి రాష్ట్రంలో ఇలాంటి పాదయాత్రలు నిర్వహించనున్నారు.
పాదయాత్ర గురించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ద్రవ్యోల్బణం, ఆర్థిక సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామూహిక ఆందోళన కార్యక్రమం గురించి చర్చించారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) పాదయాత్ర సామరస్యంపైనే ఉంటుంది. మోదీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురంచి ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారు.
కాగా దేశం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తోందని, ఐక్యంగా ఉన్నామనే సందేశాన్ని ఇవ్వాలని సోనియా సూచించారు.
Also Read : రాబోయే మార్పులకు నాంది : శశి థరూర్