Rahul Gandhi Viral : ఈ దేశంలో ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎదుర్కొంటున్నారు. ఆయన పదే పదే దేశం ఎలా మోసానికి గురవుతోంది, ఎన్ని వనరులు అన్యాక్రాంతం అవుతున్నాయో బహిరంగంగా ఆధారాలు, అంకెలతో సహా ప్రశ్నిస్తున్నారు. ఆయనంటే గిట్టనివాళ్లు తనను పప్పు అన్నా పట్టించు కోలేదు. ఇవాళ దేశానికి సంబంధించిన ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో పడిందన్నది మాత్రం నిజం. దీనిని ఇటు భారత్ లో అటు ప్రపంచ వ్యాప్తంగా వెలుగులోకి తీసుకు రావడంలో ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారు.
గత కొంత కాలంగా మోదీ ఎలా తన అనుచర వర్గాలకు, తన మిత్ర బృందాలకు ఎలా సీపీయూలను (ప్రభుత్వ రంగ సంస్థలు) ధారాదత్తం చేశాడో బహిరంగంగా నిలదీశారు. మరో వైపు మణిపూర్ గత కొన్ని రోజుల నుంచి కాలిపోతోంది. ఎక్కడ చూసినా హింసోన్మాదం రాజ్యం ఏలుతోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ పవర్ లో కొనసాగుతోంది. అయినా కంట్రోల్ చేయలేక పోతోంది. దీనిని ముందు నుంచీ నిలదీస్తూ వచ్చారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
బీజేపీ ఎంతగా తనపై అసత్యపు ప్రచారం చేసినా , వాస్తవాలను బీజేపీ , దాని అనుబంధ శ్రేణులు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా దాచ లేరంటూ స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఈ దేశానికి నమ్మకమైన నాయకుడు అని కాంగ్రెస్ ఫోటో షేర్ చేసింది. ఇది వైరల్ గా మారింది.
Also Read : Bhatti Vikramarka : మోసానికి చిరునామా కేసీఆర్ పాలన
