Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మరోసారి మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దేశంలో 40 లక్షల మంది భారతీయులు కోవిడ్ తో మరణించారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే తాను చేసిన తప్పిదం ప్రజలకు తెలుస్తుందని ఇప్పటి వరకు ఎంత మంది చని పోయారనే దానిపై ఈరోజు వరకు నివేదిక విడుదల చేయలేదన్నారు.
తాజాగా నలుగురి మరణంతో కరోనాతో చని పోయిన వారి సంఖ్య 5 లక్షల 21 వేల 751 మందికి చేరుకుంది. దీని కంతంటికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
చని పోయిన ఒక్కో కుటుంబానికి మోదీ ప్రభుత్వం రూ. 4 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్లోబల్ కోవిడ్ మరణాల సంఖ్యను బహిరంగ పరిచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న ప్రయత్నాలను భారత దేశం ప్రత్యేకించి మోదీ సర్కార్ నిలిపి వేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ స్క్రీన్ షాట్ ను రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిజాలు మాట్లాడరు.
ఇతరులను మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా ఆయన భజననే చేయాలి తప్ప ఇంకొకటి మాట్లాడేందుకు వీలు లేదన్నారు.
ఆక్సిజన్ కొరత వల్ల ఎవరూ చని పోలేదంటూ ఇప్పటి దాకా అబద్దాలు చెబుతూ వచ్చారని ఆరోపించారు. 5 లక్షల మంది కాదు 40 లక్షల మంది చని పోయారంటూ వాపోయారు.
Also Read : పదవి పోయినా ప్రశ్నించడం మానను