Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. కర్ణాటకలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పవర్ లోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కన్నడ నాట పర్యటించిన రాహుల్ గాంధీ(Rahul Gandhi )ప్రముఖ నటుడు పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని సందర్శించారు. వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. గొప్ప నటుడిని కోల్పోవడం బాధాకరమన్నారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. రాబోయు ఎన్నికల్లో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఖావడం ఖాయమన్నారు.
పార్టీకి చెందిన నేతలు మాజీ సీఎం సిద్దరామయ్య, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ , రాజ్యసభ కాంగ్రెస్ సభా పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, తదితర నేతలపై పార్టీని పవర్ లోకి తీసుకు రావాల్సిన బాధ్యత ఉందన్నారు.
కనీసం 150 సీట్లు గెలిచేలా ప్రయత్నం చేయాలని రాహుల్ గాంధీ(Rahul Gandhi )సూచించారు. కేంద్రంలో , రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందంటూ ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్మడమే పనిగా పెట్టుకున్నాడంటూ మోదీపై నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. భేదాలు వీడి కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ పరంగా యువత, మహిళలపై ఫోకస్ పెట్టాలని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని చెప్పారు. ప్రతి రోజూ అవినీతి గురించి మోదీ మాట్లాడతారని కానీ కర్ణాటకలో చోటు చేసుకున్న కరప్షన్ గురించి మాట్లాడక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
Also Read : గుజరాత్ పై ఆమ్ ఆద్మీ పార్టీ ఫోకస్