Ashok Gehlot : ఏఐసీసీ కీలక సమావేశం కంటే ముందు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఏకంగా గాంధీ కుటుంబానికి మద్దతు పలికారు.
ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ చీఫ్ గా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ దేశంలో సుస్థిరమైన పాలనను అందించే సత్తా ఒక్క తమ పార్టీకి మాత్రమే ఉందన్నారు.
ఏఐసీసీ కీలక సమావేశంలో తాను ఇదే ప్రతిపాదించ బోతున్నట్లు తెలిపారు. గెలుపు ఓటములు అన్నవి రాజకీయాలలో సహజమైనవని పేర్కొన్నారు. ఒకప్పుడు దేశంలో బీజేపీకి 2 సీట్లు మాత్రమే ఉన్నాయన్న విషయాన్ని మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
ఈ దేశంలో 700 సీట్లు కలిగిన ఏకైక జాతీయ పార్టీ తమదని పేర్కొన్నారు. ప్రతిపక్షాల కంటే 20 శాతం ఓటు బ్యాంకు ఇప్పటికీ ఉందన్నారు.
అయితే జనాన్ని మేనేజ్ చేయడంలో, పోల్ మేనేజ్ మెంట్ చేయడంలో బీజేపీ ఆరి తేరిందంటూ కొందరు ఆ పార్టీకి చెందిన సీనియర్లు వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో అధిర్ రంజన్ చౌదరి ఘాటు విమర్శలు చేశారు బెంగాల్ సీఎం , టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీపై. ఆమె భారతీయ జనతా పార్టీకి తొత్తుగా మారారని ఆరోపించారు.
ఇదే సమయంలో అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ ను ముస్లిం పార్టీగా ప్రచారం చేసిందన్నారు.
దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడు కోవడం తమ పార్టీ ముందున్న లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో మతం తెరపైకి వస్తుందన్నారు. అంతర్గత కలహాల కారణంగానే పంజాబ్ లో పవర్ కోల్పోయామన్నారు.
Also Read : దేశ భద్రతపై మోదీ సమావేశం