Rahul Gandhi Agnipath : ‘అగ్నిప‌థ్ స్కీం’ ప్రమాదం – రాహుల్

జై జ‌వాన్ జై కిసాన్ నినాదం ఎక్క‌డ

Rahul Gandhi Agnipath : ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావ‌డం లేదు. దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్ర‌ధాన మంత్రి మోదీ ముంద‌స్తు చ‌ర్చ‌లు లేకుండా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

ఆ త‌ర్వాత అభాసు పాల‌వుతున్నారు. మొన్న‌టికి మొన్న సాగు చ‌ట్టాల‌ను తీసుకు వ‌చ్చారు. పెద్ద ఎత్తున రైతులు చేసిన నిర్విరామ నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల దెబ్బ‌కు దిగి వ‌చ్చారు.

ఏకంగా తాను తీసుకు వ‌చ్చిన చ‌ట్టాలు త‌ప్ప‌ని తెలుసుకున్నారు. కానీ పుణ్య కాలం గ‌డిచి పోయింది. ప‌లువురు రైతులు చ‌ని పోయారు.

ఇప్పుడు మ‌రోసారి అలాంటి నిర్ణ‌యం తీసుకుని నిరుద్యోగ యువ‌కుల పాలిట శాపంగా మారారంటూ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi Agnipath).

శ‌నివారం ఆయ‌న తీవ్ర స్తాయిలో మోదీని టార్గెట్ చేశారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ సంస్థ‌ల్ని నిర్వీర్యం చేస్తూ వ‌చ్చిన మోదీ..పాల‌న చేత‌కాక ర‌క్ష‌ణ రంగంపై ప‌డ్డార‌ని ఆరోపించారు.

సాయుధ బ‌ల‌గాలలో కాంట్రాక్టు వ్య‌వ‌స్థ తీసుకు రావ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. అగ్నిప‌థ్ స్కీం పూర్తిగా దేశానికి ప్ర‌మాద‌మ‌న్నారు.

ఆనాటి ప్ర‌ధాన మంత్రి లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి నిన‌దించిన జై జ‌వాన్ జై కిసాన్ అన్న నినాదానికి మోదీ తూట్లు పొడుస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi Agnipath).

దీనిని గుర్తించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. నిరంత‌రం భార‌తీయ విలువ‌ల గురించి మాట్లాడే భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎందుకు మౌనం వ‌హించిందంటూ ప్ర‌శ్నించారు.

దేశంలో కీల‌క పాత్ర పోషిస్తున్న రైతులు, సైనికుల ప‌ట్ల ఎందుకు ఇంత వివ‌క్ష అని నిల‌దీశారు. అగ్నిప‌థ్ స్కీం దేశానికి ప్ర‌మాద‌క‌ర‌మ‌ని హెచ్చ‌రించారు.

Also Read : అగ్నిప‌థ్’ అగ్నిగుండం ఆగ‌ని విధ్వంసం

Leave A Reply

Your Email Id will not be published!