Rahul Gandhi : దొరల రాజ్యం దొంగల పెత్తనం
బీఆర్ఎస్, బీజేపీ లక్ష కోట్ల దోపిడీ
Rahul Gandhi : కొల్లాపూర్ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా భేరి బహిరంగ సభలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) పాల్గొని ప్రసంగించారు.
Rahul Gandhi Comment Viral
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ, రాష్ట్రంలో పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని అన్నారు. వీరిద్దరూ కలిసి తెలంగాణ రాష్ట్ర సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే లక్ష కోట్లకు పైగా ఆగమాగం చేశారని ఆవేదన చెందారు రాహుల్ గాంధీ.
ఏపీ రాష్ట్రం విడి పోయిన సమయంలో మిగులు బడ్జెట్ ఉండేదని కానీ ఇప్పుడు అది కాస్తా ఏకంగా మూడున్నర లక్షల కోట్లకు పేరుకు పోయిందన్నారు. ఇవాళ జరగబోయే ఎన్నికలు నీతికి, అవినీతికి, ధర్మానికి అధర్మానికి , దొరలకు పేదలకు మధ్య జరుగుతున్న పోరు అని అభివర్ణించారు రాహుల్ గాంధీ.
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి, తెలంగాణ పేరుతో దోపిడీకి తెర తీశారంటూ కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు రాహుల్ గాంధీ.
ప్రజలు తెలివితో వ్యవహరించాలని, విలువైన ఓటును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీ హామీలు తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.
Also Read : Tummala Nageshwara Rao : టీడీపీ కండువాతో తుమ్మల ప్రచారం