Rahul Gandhi : ‘జెండా’ను కూడా అమ్మకానికి పెట్టారా
మోదీ సర్కార్ పై రాహుల్ గాంధీ ఫైర్
Rahul Gandhi : ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావడం లేదు. ప్రతిదీ వ్యాపారంగా మార్చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi). ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రతి ఇంటా జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి.
ఇదిలా ఉండగా జాతీయ పతాకం అంటేనే అది జాతికి చిహ్నం. దేశానికి గౌరవాన్ని తీసుకు వచ్చేందుకు దోహద పడుతోంది. దానిని ఎవరు అవమానించినా దేశ ద్రోహం కిందే లెక్క
. కానీ సీన్ మారింది. చివరకు భారత త్రివర్ణ పతాకాన్ని అమ్మకానికి పెట్టారు. ఇది సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది ఎవరో కాదు భారతీయ జనతా పార్టీకి చెందిన ఫిల్ బ్రిత్ ఎంపీ వరుణ్ గాంధీ.
ఈ దేశంలో జెండాను..రేషన్ ను అమ్మకానికి పెట్టడం దారుణమని మండిపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మోదీ చెప్పేవన్నీ అబద్దాలేనంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిప్పులు చెరిగారు.
ఇప్పటికే ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్మకానికి పెట్టిన ప్రధాని చివరకు జాతీయ జెండాను కూడా వదలలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదేనా భారతీయం అంటే..ఇదేనా జాతీయ వాదం ఇదేనా హిందూత్వం అంటే అని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. రూ. 20 పెట్టి కొనాల్సిందేనంటూ రేషన్ దుకాణాల్లో రేషన్ దారులకు చెప్పడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
హరియాణా లోని కర్నాల్ లో ఓ రేషన్ డీలర్ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జాతీయతను బీజేపీ అమ్మకానికి పెట్టింది..పేదల ఆత్మ గౌరవాన్ని గాయపరిచింది అంటూ పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ.
Also Read : కొలువు తీరనున్న జగదీప్ ధన్ ఖర్