Rahul Gandhi : పిఎస్‌యులు నిర్వీర్యం రాహుల్ ఆగ్ర‌హం

ప్ర‌ధాన‌మంత్రి మోదీపై సీరియ‌స్ కామెంట్స్

Rahul Gandhi  : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అనుస‌రిస్తున్న విధానాల‌ను ఎండ‌గట్టారు. ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. ఆయ‌న ప్ర‌ధానంగా పిఎస్‌యుల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఈ దేశానికి అవి గ‌తంలో గ‌ర్వ కార‌ణంగా నిలిచాయ‌ని తెలిపారు. ఆనాడు యువ‌తీ యువ‌కుల‌కు వీటిలో ప‌ని చేయాల‌న్న త‌లంపు ఉండేద‌న్నారు. కానీ మోదీ కొలువు తీరాక వాటికి ప్ర‌యారిటీ లేకుండా పోయింద‌ని మండిప‌డ్డారు రాహుల్ గాంధీ.

దేశంలోని పీఎస్ యుల‌లో 2014 నాటికి 16.9 ల‌క్ష‌లు ఉండేద‌న్నారు. కానీ అది 2022 సంవ‌త్స‌రం నాటికి 1.6 ల‌క్ష‌ల‌కు త‌గ్గింద‌ని స్ప‌ష్టం చేశారు . ఎక్క‌డైనా ప్ర‌గ‌తిశీల దేశం అని చెప్పుకుంటున్న ఈ ప్ర‌భుత్వంలో ఎందుకు జాబ్స్ త‌గ్గాయంటూ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్ర‌శ్నించారు మోదీని. కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలోని భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ లో 1,81,127 మంది జాబ్ లు కోల్పోయార‌ని పేర్కొన్నారు. సెయిల్ లో 61,928 మంది, ఎంటీఎన్ఎల్ లో 34,997 మంది, ఎస్ఈసీఎల్ లో 29,140, ఫుడ్ కార్పొరేష్ ఆఫ్ ఇండియాలో 28 వేల 63 మంది , ఓఎన్జీసీలో 21 వేల 120 మంది కొలువులు కోల్పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాహుల్ గాంధీ.

ప్ర‌తి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పిన వారు 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు త‌గ్గించారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఆయా సంస్థ‌ల‌లో కాంట్రాక్టు భ‌ర్తీల‌ను రెట్టింపు చేసింద‌న్నారు. ఇది రాజ్యాంగ విరుద్దం కాదా అంటూ నిల‌దీశారు .

Also Read : Actor Vijay : ‘త‌ళ‌ప‌తి’ ఆస‌రా విద్యార్థులు ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!