Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi )మరోసారి కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడి పోయింది.
సీడబ్ల్యూసీ కీలక మీటింగ్ ముగిశాక ఆయన మొదటిసారిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. మరోసారి దేశ ప్రజలను హెచ్చరించారు. రాను రాను ద్రవ్యోల్బణం పెరిగి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీని వల్ల రాబోయే రోజుల్లో ప్రజలపై పన్నుల భారం పడే ప్రమాదం ఉందన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దం ప్రారంభం కాక ముందే తాను కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించానని కానీ ప్రధానమంత్రి మోదీ పట్టించు కోలేదని ఆరోపించారు.
ఎన్నికల ప్రచారం, తన వ్యక్తిగత పాపులారిటీ పెంచుకోవడం ఎలా అన్న దానిపై ఫోకస్ పెట్టారంటూ మండిపడ్డారు. ఓ వైపు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం దారుణమని పేర్కొన్నారు.
ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. వార్ స్టార్ట్ కాకముందే దేశంలో రికార్డు స్థాయిలో ధరలు ఎందుకు పెరిగాయని మోదీని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. దీని వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా మోదీ తాను మారాలని జనాన్ని రక్షించాలని కోరారు. ఇదిలా ఉండగా కేంద్ర సర్కార్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరి లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్ట స్థాయి 6.07 శాతానికి చేరుకుంది.
ముడి చమురు, ఆహారేతర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
Also Read : 10 మందితో పంజాబ్ కేబినెట్