Rahul Gandhi : దేశంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో పక్కనే ఉన్న శ్రీలంక లాగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రధాన వ్యవస్థలను పనిగట్టుకుని నిర్వీర్యం చేస్తూ వస్తోందంటూ ధ్వజమెత్తారు.
విపక్షాలన్నీ ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. లండన్ లో ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సులో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు.
ఇక భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా మతం, కులం, ప్రాంతం, భాష, అల్లర్ల పేరుతో కిరోసిన్ అనే విద్వేషాన్ని చల్లిందని ఒకవేళ ఎవరైనా దానిని కదిలిస్తే పెను సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు.
భారత రాజ్యంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని , కానీ దానిపై కూడా ఒక పద్ధతి ప్రకారం దాడి చేస్తూ వస్తోందంటూ ధ్వజమెత్తారు
రాహుల్ గాంధీ(Rahul Gandhi). కాంగ్రెస్ పార్టీ పరంగా ఎప్పటికప్పుడు దేశ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నామన్నారు.
గతంలో ఎన్నడూ లేని రీతిలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయని దీనికి కరోనాను కారణం చూపుతూ తప్పించు కోవాలని చూస్తున్నారంటూ మోదీపై ఫైర్ అయ్యారు.
కేంద్ర సర్కార్ ను ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు. ప్రతిపక్షంగా ప్రజల్ని, రాష్ట్రాల్ని, మతాల్ని, అన్ని వర్గాల వారిని ఏకం చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ప్రశ్నించే గొంతుకల్ని తుద ముట్టించే ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
Also Read : సిద్దూ ఖైదీ నెంబర్ 241383