Rahul Gandhi : మహ్మద్ జుబైర్ అరెస్ట్ దారుణం – రాహుల్
సత్యాన్ని ఎంత కాలం నోరు మూయించగలరు
Rahul Gandhi : మతోన్మాదాన్ని ప్రేరేపించాడని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు మంగళవారం ఫ్యాక్ట్ చెకింగ్ ఆల్ట్ న్యూస్ వెబ్ సైట్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ ను అరెస్ట్ చేసింది.
ఒక రోజు కస్టడీకి తీసుకుంది. అయితే ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయాలంటే ముందు అరెస్ట్ వారెంట్ ఉండాలి. లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ తమకు ఇవ్వలేదంటూ ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ సిన్హా ఆరోపించారు. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. పోలీసులు పై వారి మెప్పు కోసం ఇలా చేస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహూవా ఆరోపించారు.
ఇదే సమయంలో జుబైర్ అరెస్ట్ పై సీరియస్ గా స్పందించారు కాంగ్రెస్ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) . ఇవాళ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతీయ జనతా పార్ట దేశంలో ద్వేసాన్ని, మతోన్మాదాన్ని, అబద్దాలను బయట పెట్టే ప్రతి ఒక్కరిని ముప్పుగా, వ్యతిరేకంగా చూస్తోందని పేర్కన్నారు. అందులో భాగంగానే మహ్మద్ జుబైర్ ను అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ.
ఇలా ఎంత కాలం ఎంత మందిని అరెస్ట్ చేసుకుంటూ పోతారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఒక రకంగా కేంద్రాన్ని నిలదీశారు. ఒక్క గొంతును మూయగలరు కానీ వేల గొంతుల్ని అదిమి పెట్టలేరన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు.
నిరంకుశత్వంపై సత్యం ఏదో ఒక రోజు విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
Also Read : ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ జుబైర్ అరెస్ట్