Rahul Gandhi : భారత దేశం శ్రీలంకను తలపిస్తోంది
మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆయన గత కొంత కాలంగా నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేకుండా పోయిందని పేర్కొన్నారు.
ప్రజలు ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే మోదీ తన వ్యక్తిగత ప్రచారంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత దేశం ప్రస్తుతం తనకు ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంక లాగా అనిపిస్తోందని పేర్కొన్నారు.
2017 నుండి దేశంలో నిరుద్యోగం పెరుగతోందని, 2020 నాటికి అది గరిష్ట స్థాయికి చేరుకుందని గ్రాఫ్ కూడా జత పరిచారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
ఇరు దేశాలకు సంబంధించిన గ్రాఫ్ లను కూడా ఆయన షేర్ చేశారు. మోదీ విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల పాలిట శాపాలుగా తయారయ్యాయని కానీ బడా బాబులకు, బ్యాంకు మోసగాళ్లకు, కార్పొరేట్ కంపెనీలకు, వ్యాపారవేత్తలకు ఆదాయ వనరులుగా మారాయని సంచలన ఆరోపణలు చేశారు.
మతం పేరుతో, కులం పేరుతో లేదా ఇతర అంశాల నుంచి జనాన్ని పక్కకు మరల్చడంలో మోదీ సక్సెస్ కాగలరేమో కానీ వాస్తవ పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉందన్నారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి కారణం కరోనా, ప్రపంచ ఆర్థిక పరిస్థితులంటూ దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని ఇది ఎంత మాత్రం వాస్తవం కాదన్నారు
ప్రభుత్వ ఆస్తులను గంపగుత్తగా అమ్మేసుకుంటూ పోతే ఇక పాలన ఏం సాగిస్తారని ప్రశ్నించారు సూటిగా రాహుల్ గాంధీ(Rahul Gandhi).
Also Read : ఉరి శిక్ష సమస్యకు పరిష్కారం కాదు