Rahul Gandhi : మధ్యప్రదేశ్ ఘటనపై రాహుల్ ఫైర్
బీజేపీ పాలనలో గిరిజనులపై దౌర్జన్యాలు
Rahul Gandhi : మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న మూత్ర విసర్జన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. దీనికి పాల్పడింది అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తిగా ఆరోపణలు వచ్చాయి. బుధవారం ట్విట్టర్ వేదికగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. ఘటనపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. మధ్యప్రదేశ్ లో పాలన పడకేసిందని, అరాచకం రాజ్యం ఏలుతోందని ఆరోపించారు. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు.
2019 నుంచి నేటి దాకా ఆ రాష్ట్రంలో దళితులు, బడుగు, బలహీన వర్గాలపై పెద్ద ఎత్తున దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఇప్పటికే తమ పార్టీ దశల వారీగా ఎన్నెన్ని కేసులు నమోదయ్యయానే దానిపై వివరాలు కూడా అందించినట్లు తెలిపారు. అధికారం ఉంది కదా అని రెచ్చి పోతే ఎలా అని ప్రశ్నించారు. వెంటనే బాధితుడికి క్షమాపణలు చెప్పాలని, గిరిజనుడిపై మూత్రం పోసిన బీజేపీ నేతను వెంటనే అరెస్ట్ చేయాలని, తగిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ.
ఆదివాసీలు, దళితుల పట్ల బీజేపీ ద్వేషానికి ఇది అసహ్యకరమైన ముఖం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ప్రభుత్వం ఎందుకు పట్టించు కోవడం లేదంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ. రాష్ట్రంలోని సిధి జిల్లాలో గిరిజన వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్నట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Mallikarjun Kharge : నాయకత్వానికి శిక్షణ అవసరం – ఖర్గే