Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న తీరుపై సీరియస్ అయ్యారు. సిబీఎస్ఈలో సిలబస్ లో మార్పు చేయడాన్ని తప్పుపట్టారు.
ఆఫ్రో, ఆసియన్ భూ భాగాల్లోని ఇస్లామిక్ సామ్రాజ్యాలు, మొఘల్ కోర్టుల చరిత్రలు, ప్రచ్చన్న యుద్దం, పారిశ్రామిక విషయాలపై సిలబస్ మార్చడం, అధ్యాయాలను తొలగించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
11, 12 తరగతుల చరిత్ర , రాజకీయ శాస్త్ర సిలబస్ నుంచి అధ్యాయాలు తొలగించడం పూర్తిగా కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు.
ఆయన తొలగించిన వాటికి సంబంధించి మ్యాపులతో కూడిన చిత్రాలు పంచుకున్నారు. విద్యా బోర్డును రాష్ట్రీయ శిక్షా ష్రెడర్ అని పేరు పెట్టారు. పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవితలు కూడా ఇందులో ఉన్నాయి.
వాటిని కూడా కేంద్రం తొలగించింది. దీనిని కూడా ప్రస్తావించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). 10వ తరగతి సిలబస్ లో ఆహార భద్రత అనే అధ్యాయం నుంచి వ్యవసాయంపై ప్రపంచీకరణ ప్రభావం అనే అంశం తొలగించారు.
సిలబస్ హేతుబద్దీకరణ లో భాగంగానే ఈ మార్పు జరిగిందని ప్రచారం జరుగుతోంది. 2022-23 బ్యాచ్ కోసం బోర్డు ఒక పరీక్షను మాత్రమే నిర్వహించేందుకు సిద్దంగా ఉంది.
ఇదిలా ఉండగా గత కొంత కాలంగా మోదీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. లౌకికవాద దేశంలో మత సంబంధ విషయాలను చొప్పించేందుకు యత్నిస్తున్నారంటూ ఆరోపించారు. విద్యా రంగాన్ని కాషాయీకరణ చేయడం మంచి పద్దతి కాదన్నారు.
Also Read : హిందూత్వ సంస్కృతి గందరగోళం కాదు