Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. గత కొంత కాలం నుంచీ రాహుల్ గాంధీ ధరల పెరుగుదలపై నిప్పులు చెరుగుతున్నారు.
అంతే కాదు కొందరు వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం దేశాన్ని తాకట్టు పెడుతున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికే ఆయన సామాజిక వేదికల ద్వారా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వస్తున్నారు.
ఇటీవల ఎన్నికల సందర్భంగా ధరలను నిలపుదల చేసిన మోదీ సర్కార్ ఫలితాలు వెలువడిన వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో గత కొన్ని రోజులుగా అడ్డూ అదుపు లేకుండా ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. యుద్దం పేరుతో తాము పెంచాల్సి వస్తోందంటున్నాయి గ్యాస్, ఆయిల్ కంపెనీలు. ఆయన ఇప్పటికే మోదీ గురించి ఎద్దేవా చేశారు.
కరోనా సమయంలో గంట కొట్టిన మోదీకి ధరలు పెంచినందుకు ప్రజలంతా చప్పట్లతో స్వాగతం పలకాలని సెటైర్ విసిరారు. ప్రజలను నిస్సిగ్గుగా దోచుకుంటున్న కేంద్రానికి ముకుతాడు వేయాలని రాహుల్ గాంధీ(Rahul Gandhi )పిలుపునిచ్చారు.
జనం అష్టకష్టాలు పడుతుంటే రాజు ( ప్రధాని ) రాజసౌధంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడంటూ మండిపడ్డారు. జనంపై ధరల భారం మోపుతో ఇంకో వైపు ప్రమాణ స్వీకారాలు జరుపుకుంటోందంటూ ఆరోపించారు.
ప్రజల ఇబ్బందులను పట్టించు కోకుండా తన వ్యక్తిగత ప్రచారానికే ప్రయారిటీ ఇవ్వడాన్ని తప్పు పట్టారు. ప్రభుత్వ సంస్థలను అప్పగించే అధికారం మోదీకి లేదన్నారు.
Also Read : ధరా భారంపై కాంగ్రెస్ దరువుల మోత