Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అబద్దాలు ఆడడంలో మోదీ టాప్ లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. యూపీలో ఆయన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.
యూపీలో ఆరు విడతల పోలింగ్ ముగిసింది. ఇంకో విడత పోలింగ్ మిగిలింది. ఈనెల 10న ఐదు రాష్ట్రాలకు సంబంధించిన రిజల్ట్స్ రానున్నాయి. దేశానికి ప్రాతినధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వరకు బాధ్యతతో పని చేయడం లేదన్నారు.
అబద్దం అన్న ప్రాతిపదికన మీదనే ఆయన నడుస్తున్నాడని, దానినే భ్రమిస్తూ జనాన్ని మోసం చేస్తున్నాడంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi ). ధర్మాన్ని ప్రాతిపదికగా కాకుండా అధర్మం ఆధారంగా ఓట్లు అడుగుతున్నాడని మండిపడ్డారు.
గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని కానీ వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ దేశాన్ని అప్పులపాలు చేసిన ఘనత మోదీకే దక్కిందన్నారు.
ఎంతకాలమని అబద్దాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడుపుతారంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని కానీ ప్రధాని వాటి గురించి పట్టించుకోక పోవడం దారుణమన్నారు.
ఇదిలా ఉండగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ కొందరికే ప్రయారిటీ ఇస్తూ దేశాన్ని సర్వ నాశనం చేస్తున్న మోదీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు కానీ వాటి గురించి పట్టించు కోలేదు. యువకులకు ఉపాధి కల్పిస్తామన్నారు మరిచి పోయారని ఫైర్ అయ్యారు.
Also Read : విద్యార్థుల భద్రతపై సీజేఐ ఆందోళన