Rahul Gandhi Modi : మణిపూర్ కాలి పోతుంటే మౌనమేల
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్
Rahul Gandhi Modi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన మణిపూర్ రాష్ట్రంలో చోటు చేసుకున్న హింస గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత 50 రోజులుగా రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం కంట్రోల్ చేయలేక పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి దానికి స్పందించే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఎందుకు మణిపూర్ గురించి మాట్లాడడం లేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీ.
గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు పీఎంపై. ప్రధానమంత్రి అమెరికా టూర్ లో ఉన్నారని , దేశంలో లేని సమయంలో చూసుకుని సమావేశానికి రావాలంటూ అఖిలపక్షాన్ని పిలవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. దీంతో ఈ భేటీ అనేది ప్రధాన మంత్రికి ముఖ్యం కాదని తేలి పోయిందన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
ఇదిలా ఉండగా మణిపూర్ లో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య, ఘర్షణ పోరులో ఇప్పటి వరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మందికి పైగా రాష్ట్రాన్నివిడిచి పెట్టి పోయారు. 10 వేల మందికి పైగా సైనికులు మోహరించారు. ఇంకా మణిపూర్ కంట్రోల్ లోకి రావడం లేదు.
Also Read : CM KCR Wishes Vijay : విజయ్ కి కేసీఆర్ విషెస్