Rahul Gandhi : అమరులను అవమానిస్తే ఎలా
నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ
Rahul Gandhi : న్యూఢిల్లీ – పార్లమెంట్ సాక్షిగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం పట్ల అవాకులు చెవాకులు పేలిన ప్రధాన మంత్రిపై నిప్పులు చెరిగారు వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇక నైనా తమ నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు.
Rahul Gandhi Slams PM Modi
మంగళవారం ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. పదే పదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును , ఏర్పడిన ప్రక్రియను, అస్థిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని అగౌరవ పరిచేలా చులకన చేసి మోదీ మాట్లాడడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు వాయనాడు ఎంపీ.
తెలంగాణ రాష్ట్రంపై తన అక్కసును ఇక నుంచి మాను కోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు రాహుల్ గాంధీ. బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్ఆపలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మాట్లాడుతున్నా తెలంగాణ బీజేపీకి చెందిన మంత్రి, ప్రజా ప్రతినిధులు నోరు మెదపక పోవడాన్ని తీవ్రంగా మండిపడ్డారు రాహుల్ గాంధీ.
Also Read : Jay Shah Golden Ticket : తలైవాకు జే షా గోల్డెన్ టికెట్