Rahul Gandhi : మధ్యప్రదేశ్ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలో ప్రసంగించారు రాహుల్ గాంధీ.
Rahul Gandhi Slams Modi
దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఇవాళ దేశంలో గతంలో లేని రీతిలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగి పోయిందని ఆవేదన చెందారు. ఆర్బీఐ ఏం పని చేస్తోందంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ.
ప్రస్తుతం దేశంలోని 5 రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందన్న తమకు నమ్మకం ఉందన్నారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రధానమంత్రి పదే పదే తానే గొప్ప దేశ భక్తుడినని ఫీల్ అవుతారని కానీ చేసే పనులు మాత్రం పూర్తిగా వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కోసమే పని చేస్తున్నాడని ఆరోపించారు.
మోదీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాను రాను ప్రజల ఆదరణ కోల్పోతున్నాడని మండిపడ్డారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ప్రత్యేకించి ఈసారి బీజేపీకి షాక్ తగలక తప్పదన్నాడు. ఇది అక్షరాల వాస్తవమని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నాడు.
Also Read : Priyanka Gandhi : బీఆర్ఎస్..బీజేపీ ఒక్కటే