Rahul Gandhi : జాబ్స్ ఇస్తామ‌న్నారు అగ్గి రాజేశారు – రాహుల్

అగ్నిప‌థ్ స్కీం ఓ బ‌క్వాస్ అంటూ ఫైర్

Rahul Gandhi : ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోలేక పోయారు. త‌న పార్టీ నుంచే కాదు బ‌య‌టి నుంచి కూడా ఎదుర‌వుతున్న ఒత్తిడిని త‌ట్టుకోలేక ఉన్న‌ట్టుండి అగ్నిప‌థ్ స్కీంను తీసుకు వ‌చ్చారు.

అన్ని రంగాల‌ను ప్రైవేట్ ప‌రం చేస్తూ వెళుతున్న ప్ర‌ధానికి చివ‌ర‌కు ర‌క్ష‌ణ రంగాన్ని ఎందుకు చేయకూడ‌ద‌ని అనుకున్నారంటూ మండిప‌డ్డారు.

దేశంలో కీల‌క‌మైన రంగాన్ని ఇలా నిర్వీర్యం చేస్తే చివ‌ర‌కు దేశం ఏమై పోవాల‌ని మోదీని నిల‌దీశారు. ఇది పూర్తిగా అవ‌గాహ‌న రాహిత్యంతో కూడుకున్న నిర్ణ‌య‌మ‌ని మండిప‌డ్డారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .

ఆదివారం ఆయ‌న స్పందించారు. దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు , ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. మీ అనాలోచిత నిర్ణ‌యం వ‌ల్ల ఇప్ప‌టికే రైతులు చ‌ని పోయారు.

ఇంకెమంది జ‌వాన్లు కావాల‌ని అనుకుంటున్న నిరుద్యోగుల ప్రాణాలు తీసుకోబోతున్నారంటూ ప్ర‌శ్నించారు. పిల్ల‌ల‌ను చూస్తే జాలి వేస్తోంద‌న్నారు. ఎవ‌రైనా స‌రే శాంతియుతంగా నిర‌స‌న తెలపాల‌ని రాహుల్ గాంధీ కోరారు.

దేశంలో 70 ల‌క్ష‌ల‌కు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. కేవ‌లం 10 ల‌క్ష‌లు భ‌ర్తీ చేస్తామంటూ ఆర్భాటంగా ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాన మంత్రికి దీనిపై క్లారిటీ లేద‌న్నారు.

అసంబ‌ద్ద‌మైన అగ్నిప‌థ్ స్కీం లో చివ‌ర‌కు అగ్గిని రాజేసేలా చేసింద‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) . గత ఎనిమిదేళ్ల‌లో 16 కోట్ల‌కు ఉద్యోగాలు ఇస్తామ‌న్నారు.

కానీ యువ‌తకు ప‌కోడీలు ఎలా త‌యారు చేయాలో మాత్ర‌మే అవ‌గాహ‌న వ‌చ్చింద‌న్నారు. అగ్నిప‌థంలో న‌డిచేలా యువ‌త‌ను ప్ర‌ధాని మోదీ బ‌ల‌వంతం చేశారంటూ ఆరోపించారు.

Also Read : నిర‌స‌న‌కారుల‌పై బుల్డోజ‌ర్లు ఎక్క‌డ‌

Leave A Reply

Your Email Id will not be published!