Rahul Gandhi Tour : కర్ణాటకలో రాహుల్ గాంధీ పర్యటన
ఏప్రిల్ , మే నెలల్లో శాసనభ ఎన్నికలు
Rahul Gandhi Tour : కర్ణాటకలో ఈ ఏడాది ఏప్రిల్ , మే నెలల్లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మధ్య వార్ కొనసాగుతోంది. మాటల యుద్దానికి తెర లేపాయి ఇరు పార్టీల నాయకులు. ఇందులో భాగంగా ఇప్పటికే బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, బీజేపీ స్టేట్ చీఫ్ జేపీ నడ్డా ప్రచారంలో బిజీగా ఉన్నారు.
ఈ తరుణంలో ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi Tour) ఆదివారం కర్ణాటకకు బయలు దేరారు. ఆయన మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాహుల్ టూర్ కు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసింది. అంతకు ముందు రాహుల్ ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. ఆయన భారత్ జోడో యాత్ర సందర్భంగా కాశ్మీర్ లో చేసిన కామెంట్స్ కు సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ నేత ఉత్తర కర్ణాటక లోని బెలగావి , తుమకూరు జిల్లా లోని కుణిగల్ లో జరిగే రెండు కార్యక్రమాలలో పాల్గొంటారు రాహుల్ గాంధీ. ఇందులో భాగంగా ఆయన మూడు రోజుల పాటు కర్ణాటకలోనే ఉంటారు. కాంగ్రెస్ నేత హుబ్బల్లి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బెలగావికి వెళతారు. సోమవారం మధ్యాహ్నం బెలగావిలో జరగనున్న యువ క్రాంతి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశానికి హాజరవుతారు.
Also Read : రాహుల్ గాంధీ ఇంటి వద్ద హైడ్రామా