Rahul Gandhi : గుజ‌రాత్ కోర్టుకు రాహుల్ గాంధీ

సూర‌త్ తీర్పును స‌వాల్ చేస్తూ దావా

Rahul Gandhi :  కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ త‌రుణంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని అవ‌మానించేలా చేసిన వ్యాఖ్యకు సంబంధించి ప‌రువు న‌ష్టం కేసులో త‌న‌ను దోషిగా నిర్దారించిన మేజిస్ట్రేట్ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ సూర‌త్ సెష‌న్స్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ వెల్ల‌డించింది.

రాహుల్ గాంధీని తొల‌గించిన త‌ర్వాత కేర‌ళ లోని వయ‌నాడ్ సీటు ప్ర‌స్తుతం ఖాళీగా ఉంది. లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా రాహుల్ పై అన‌ర్హ‌త వేటు వేశారు. 2019 నాటి ప‌రువు న‌ష్టం కేసులో త‌న‌కు విధించిన దోషి, రెండేళ్ల శిక్ష‌పై అప్పీల్ చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)  గుజ‌రాత్ కోర్టుకు హాజ‌రు కానున్నారు. మాజీ కాంగ్రెస్ చీఫ్ ఇచ్చిన తీర్పుపై మ‌ధ్యంత‌ర స్టే ఇవ్వాల‌ని కోర‌నున్నారు పిటిష‌న్ లో.

ఆయ‌న త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది ఆర్ఎస్ చీమా కోర్టులో వాదించ‌నున్నారు. గుజ‌రాత్ కోర్టు తీర్పుతో ఎంపీగా అన‌ర్హ‌త వేటు ప‌డిన గాంధీతో పాటు రాహుల్ సోద‌రి ప్రియాంక గాంధీ, మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అశోక్ గెహ్లాట్ , భూపేష్ బ‌ఘేల్ , సుఖ్ వింద‌ర్ సింగ్ సుఖు కూడా ఉన్నారు. కోర్టుకు హాజ‌రు కావ‌డానికి ముందు రాహుల్ గాంధీ ఆదివారం త‌న త‌ల్లి సోనియా గాంధీని క‌లిశారు.

Also Read : రాజస్థాన్‌లో ఒక్క రోజులో 4,200 మందికి పైగా నేరస్థులు అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!