KRK Rahul Gandhi : క‌మాల్ ఖాన్ స‌ర్వేలో రాహుల్ టాప్

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి 2వ స్థానం

KRK Rahul Gandhi : నెట్టింట్లో మోస్ట్ పాపుల‌ర్ అన‌లిస్ట్ క‌మాల్ ఖాన్. సినిమాలు, ప్ర‌స్తుత రాజ‌కీయాలు, దేశం, ఇలా ప్ర‌తి స‌మ‌స్య‌ను ట‌చ్ చేస్తూ వ‌స్తాడు. భారీ ఫాలోయింగ్ కూడా ఉంది. నిర్మోహ‌మాటంగా త‌ను చెప్ప‌ద‌ల్చుకున్న‌ది చెప్ప‌డం ఆయ‌న‌కు అలవాటు. ఎవ‌రు ఏమ‌న్నా అనుకోని అనుకుంటూ త‌న దారిన తాను వెళ్లి పోతాడు.

తాజాగా సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ మోదీ అని అంద‌రూ బ‌య‌ట ప్ర‌చారం చేస్తున్నార‌ని కానీ అది త‌ప్పు అంటున్నారు క‌మాల్ ఖాన్(Kamal R. Khan). తాను గ‌త కొన్ని రోజులుగా ఒపీనియ‌న్ పోల్ చేప‌ట్టాన‌ని, నెట్టింట్లో స‌ర్వే చేప‌ట్టాన‌ని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశాడు క‌మాల్ ఖాన్.

రోజు రోజుకి దేశంలో అభిప్రాయాలు మారి పోతున్నాయ‌ని స్ప‌ష్టం చేశాడు. రాహుల్ గాంధీ టాప్ లోకి వ‌స్తున్నాడ‌ని పేర్కొన్నాడు. మార్చి నెల‌లో స‌ర్వే చేస్తే రాహుల్ గాంధీకి 49 శాతం రాగా మోదీకి 51 శాతం వ‌చ్చింద‌ని తెలిపాడు. మేలో రాహుల్ కు 40 శాతం , మోదీకి 60 శాతం వ‌చ్చిందని పేర్కొన్నాడు. కాగా ఊహించ‌ని రీతిలో ఇవాళ చేప‌ట్టిన స‌ర్వేలో రాహుల్ గాంధీకి 66 శాతం రాగా మోదీకి 34 శాతం మాత్ర‌మే వ‌చ్చింద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు.

Also Read : CoWin Data Breach : ‘కోవిన్’ తో జ‌ర భ‌ద్రం

 

Leave A Reply

Your Email Id will not be published!