Rahul Gandhi : మేడిగడ్డను పరిశీలించిన రాహుల్
వివరాలు అడిగిన ఏఐసీసీ మాజీ చీఫ్
Rahul Gandhi : మేడిగడ్డ బ్యారేజ్ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించారు. ఆయన వెంట టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి ఉన్నారు.
Rahul Gandhi Visit Medigadda Barrage
కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను ఎవరినీ మేడిగడ్డ లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించ లేదు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై సీరియస్ అయ్యారు రేవంత్ రెడ్డి. పార్టీ నేతలు, కార్యకర్తలు, ఖాకీల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
భారీ భద్రత మధ్య రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. అంతకు ముందు ఏరియల్ వ్యూ పరిశీలించారు. కుంగి పోయిన పిల్లర్స్ ను పరిశిలీంచారు. ఇందుకు సంబంధించి ఇంజనీర్లు రాహుల్ గాంధీకి(Rahul Gandhi) వివరించే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉండగా రూ. 1,20,000 కోట్లకు పైగా ప్రజా ధనం ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇందులో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఇది హాట్ టాపిక్ గా , సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : MLC Kavitha : ‘కొత్త’ కుటుంబానికి కవిత పరామర్శ