Rahul Gandhi : లక్ష్మమ్మ గుడిలో రాహుల్ గాంధీ పూజలు
పూజారుల ఆశీర్వచనాలు అదుకున్న నేత
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆదోనిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి అడుగడుగునా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. దారి పొడవునా రాహుల్ కు నీరాజనాలు పలుకుతున్నారు.
ఇదిలా ఉండగా ఆదోనికి చేరుకున్న రాహుల్ గాంధీ(Rahul Gandhi) అక్కడ పెద్ద ఎత్తున కొలిచే మహా యోగి లక్ష్మమ్మ అవ్వ ఆలయానికి చేరుకున్నారు. పూజలు చేశారు. ఆలయ పూజారులు రాహుల్ గాంధీకి ఆశీర్వచనం అందజేశారు. ఆయన పాదయాత్ర దిగ్విజయం కావాలని ఆశీర్వచనం చేశారు.
అమ్మ వారిని ప్రార్థించిన అనంతరం మళ్లీ పాదయాత్రలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగి పోతున్నా ప్రస్తుతం కొలువు తీరిన మోదీ ప్రభుత్వం పట్టించు కోవడం లేదని మండిపడ్డారు.
గతంలో ఎన్నడూ లేనంతగా ఈ దేశంలో సమస్యలు పేరుకు పోయాయని సోయి లేకుండా పాలన సాగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాపాడుకుంటూ వచ్చిన ప్రభుత్వ ఆస్తులను గంపగుత్తగా అమ్ముకుంటూ వెళుతున్న మోదీని, భారతీయ జనతా పార్టీని ప్రజలు ఏదో ఒకరోజు తిరస్కరించడం ఖాయమని జోష్యం చెప్పారు కాంగ్రెస్ అగ్ర నేత. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ దేశాన్ని అప్పుల పాలు చేసిన మోదీకి గుణపాఠం చెప్పక తప్పదన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .
Also Read : కొత్త ఎయిర్ బేస్ దేశ భద్రతకు కీలకం – మోదీ