Rahul Gandhi Modi : ప్ర‌ధాని మోదీపై రాహుల్ గాంధీ సెటైర్

పార్ల‌మెంట్ లో మాట్లాడే స్వేచ్ఛ‌పై ప‌హారా

Rahul Gandhi Modi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మ‌రోసారి నిప్పులు చెరిగారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) పై. తాజాగా పార్ల‌మెంట్ ( లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ‌) వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఈ సంద‌ర్భంగా పార్ల‌మెంట్ స‌చివాల‌యం ఎంపీల‌కు ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళిని త‌యారు చేసింది. ఇందులో భాగంగా బుక్ లెట్ ను విడుద‌ల చేసింది. ఏం మాట్లాడాలి. ఏం మాట్లాడ కూడ‌దనే విష‌యంపై స్ప‌ష్టం చేసింది.

ప‌లు అభ్యంత‌ర‌క‌ర ప‌దాలు వాడ కూడ‌ద‌ని పేర్కొంది. తాము పొందు ప‌ర్చిన లేదా బుక్ లెట్ లో ఉన్న ప‌దాల‌ను పార్ల‌మెంట్ స‌భ్యులు ఉప‌యోగించ కూడ‌ద‌ని తెలిపింది.

ఒక వేళ అలాంటి ప‌దాలు వాడిన‌ట్ల‌యితే ఎంపీల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. దీనిపై విప‌క్షాల‌కు చెందిన ఎంపీలు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముందు భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుల నోళ్లు మూయించాల‌ని పేర్కొన్నారు.

తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు మ‌హూవా మోయిత్రా, డెరిక్ ఒ బ్రెయిన్ , శివ‌సేన పార్టీకి చెందిన ప్రియాంక చ‌త‌ర్వేదితో పాటు కాంగ్రెస పార్టీకి చెందిన ఎంపీ జై రాం రమేష్ సైతం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఒక ర‌కంగా మోదీ త‌న‌ను తాను ర‌క్షించు కునేందుకు త‌యారు చేసిన బుక్ లెట్ అంటూ మండిప‌డ్డారు. విప‌క్షాల కంటే కాషాయానికి చెందిన వారే ఎక్కువ‌గా నోరు జారుతార‌ని, అన్ పార్ల‌మెంట‌రీ వ‌ర్డ్స్ వాడేది వాళ్లేనంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

దీనిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా సెటైర్లు విసిరారు మోదీ(Modi) పై. ఒక ర‌కంగా మాట్లాడ‌కుండా నిషేధం విధించారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read : ‘ప‌ద బంధం’పై ఎంపీల కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!