Raj Subramaniam : ఎవరీ రాజ్ సుబ్రమణ్యం అనుకుంటున్నారా. అమెరికన్ ఇండియన్. కేరళకు చెందిన ఈ ఐఐటియన్ అమెరికా పేరొందిన సిఇఓలలో ఒకరు. ప్రస్తుతం ఫెడెక్స్ ఇంటర్నేషనల్ కంపెనీకి ఆయనే కాబోయే చీఫ్.
ఇప్పటికే పలువురు భారతీయులు టాప్ కంపెనీలలో ప్రధాన పోస్టులలో కొలువు తీరారు. తాజాగా రాజ్ సుబ్రమణ్యం (Raj Subramaniam )పేరు కూడా వారి జాబితాలో చేరనుంది. ఇప్పటికే ఆయన పలు కీలక పదవులు చేపట్టారు.
ప్రస్తుతం ఫెడెక్స్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ , చీఫ్ మార్కెటింగ్ , కమ్యూనికేషన్స్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు రాజ్ సుబ్రమణ్యం.
ఫ్రెడరిక్ స్మిత్ తర్వాత జూన్ 1 నుంచి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈనెల ప్రారంభంలో రాజ్ సుబ్రమణ్యంను(Raj Subramaniam )కొత్త ప్రెసిడెంట్ , సిఇఓగా నియమించింది కంపెనీ. 2019 జనవరి 1 నుంచి బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు.
గత 27 సంవత్సరాలలో వివిధ కార్యనిర్వాహక స్థాయి పదవులు చేపట్టారు. రాజ్ సుబ్రమణ్యం మెంఫిస్ లో తన కెరీర్ స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి హాంకాంగ్ కు వెళ్లాడు.
ఆసియా పసిఫిక్ ప్రాంతానికి మార్కెటింగ్ , కస్టమర్ సేవలను పర్యవేక్షించారు. కెనడాలోని ఫెడెక్స్ ఎక్స్ ప్రెస్ కు చీఫ్ గా ఉన్నారు. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేశాడు.
2013లో ఫెడెక్స్ సర్వీసెస్ లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పదోన్నతి పొందారు. రాజ్ సుబ్రమణ్యం స్వస్థలం కేరళ. త్రివేండ్రంలో ఆయన పుట్టారు.
ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ చేశారు. సిరక్యూస్ యూనివర్శిటీలో కెమికల్ ఇంజనీరింగ్ లో ఎంఎస్ చేశారు. టెక్సాస్ యూనివర్శిటీలో ఎంబీఏ చేశారు. కార్పొరేట్ ప్రపంచంలో చేసిన సేవలకు గాను ఐఐటీ బొంబాయి విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డుతో సత్కరించారు.
Also Read : చుక్కలు చూపిస్తున్న భగవంత్ మాన్