Raj Thackeray : ఫ‌డ్న‌వీస్ పై రాజ్ ఠాక్రే కామెంట్స్

డిప్యూటీ సీఎంకు సుదీర్ఘ లేఖ

Raj Thackeray : మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే(Raj Thackeray)  ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఇటీవ‌ల ఆస్ప‌త్రికి వెళ్లి తిరిగి క్షేమంగా వ‌చ్చారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై ఆరా తీశారు.

ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం సీఎంగా కొలువు తీరిన ఏక్ నాథ్ షిండే సైతం రాజ్ ఠాక్రేతో ట‌చ్ లో ఉంటూ వ‌చ్చారు. ఇదిలా ఉండ‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ గా చివ‌రి దాకా చ‌క్రం తిప్పి డిప్యూటీ సీఎం ప‌ద‌వికే ప‌రిమిత‌మైన దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

ఈ మేర‌కు ఆయ‌న‌కు ఓ సుదీర్ఘ లేఖ రాశారు రాజ్ ఠాక్రే. గ‌తంలో సీఎం ప‌ద‌విని నిర్వ‌హించి ప్ర‌స్తుతం ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఒప్పుకోవ‌డం గ్రేట్ అని కొనియాడారు.

ప్ర‌స్తుతం చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం మాములు విష‌యం కాద‌న్నారు. ఏ స్థాయిలో ఉన్నా పార్టీకి సంబంధించిన అధినాయ‌క‌త్వం ఏది చెబితే అది చేయాల్సిందేన‌ని పేర్కొన్నారు రాజ్ ఠాక్రే(Raj Thackeray) .

పార్టీ చెప్పిన‌ట్లుగానే న‌డుచు కోవడం మంచి ప‌ద్ద‌తన్నారు. గ‌తంలో మ‌రాఠాకు సీఎంగా నిర్వ‌హించిన ఫ‌డ్న‌వీస్ మంచి పేరు తెచ్చుకున్నారని కితాబు ఇచ్చారు రాజ్ ఠాక్రే.

ఈ విష‌యంలో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌ని పేర్కొన్నారు. ఇక రాజ‌కీయ వ‌ర్గాల‌లో ఫ‌డ్న‌వీస్ కు ఇది ప్ర‌మోష‌న్ మాత్రం కాద‌ని డిమోష‌న్ అంటున్నారు.

విచిత్రం ఏమిటంటే ఏక్ నాథ్ షిండేనే సీఎం అంటూ ప్ర‌క‌టించింది కూడా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కావ‌డం అస‌లైన ట్విస్ట్.

Also Read : సిన్హాను వీహెచ్ క‌లిస్తే త‌ప్పేంటి – జ‌గ్గా రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!