Raj Thackeray Pawar : మరాఠా పరిణామాల వెనుక పవార్
రాజ్ ఠాక్రే సంచలన ఆరోపణలు
Raj Thackeray Pawar : మరాఠాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల వెనుక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ ఉన్నారంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్నది తలుచుకుంటేనే బాధగా ఉందన్నారు. ఇది రాష్ట్ర ప్రజలను ,ముఖ్యంగా ఓట్లు వేసిన వారిని కావాలని అవమానించినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు రాజ్ ఠాక్రే.
ఇది ఎవరూ ఊహించని పరిణామమని పేర్కొన్నారు. ఎన్సీపీ చీలి పోవడం , అజిత్ పవార్ షిండే, ఫడ్నవీస్ సంకీర్ణ సర్కార్ కు మద్దతు పలకడం విచిత్రంగా ఉందన్నారు. ఎన్సీపీలో శరద్ పవార్ కింగ్ మేకర్ అని , ఆయనను కాదనకుండా అజిత్ పవార్ ఏ పనీ చేయరంటూ ధ్వజమెత్తారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి మంచివి కాదన్నారు రాజ్ ఠాక్రే(Raj Thackeray).
దీనికంతటికీ ప్రధానంగా ఈ కుట్ర వెనుక శరద్ పవార్ హస్తం తప్పక ఉందని ఆరోపించాడు. ఇలాంటి కుట్రలకు, ప్రయోగాలకు తెర లేపింది పవార్ అని మండిపడ్డారు. ఆయన మొదట దీనికి శ్రీకారం చుట్టింది 1978లో అని చెప్పాడు. ఆనాడు పులోద్ అంటే పురోగామి లోక్ షాహీ దళ్ ప్రభుత్వంతో ప్రయోగాలు చేశాడంటూ ఫైర్ అయ్యారు రాజ్ ఠాక్రే. మరాఠా ఎల్లప్పుడూ ఇలాంటి చిల్లర రాజకీయాలను చూడలేదన్నారు. దీనికి ప్రధాన కారకుడు శరద్ పవార్ అంటూ మండిపడ్డారు.
Also Read : Heavy Rains : హమ్మయ్య కురిసిన వర్షం
