Raja Krishnamoorthi : ఇల్లినాయిస్ లో రాజా కృష్ణ‌మూర్తి గెలుపు

డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా ఘ‌న విజ‌యం

Raja Krishnamoorthi : భార‌తీయ అమెరిక‌న్ కాంగ్రెస్ స‌భ్యులు రాజా కృష్ణ‌మూర్తి(Raja Krishnamoorthi) అమెరికా లోని ఇల్లినాయిస్ నుండి డెమోక్ర‌టిక్ ప్రైమరీలో గెలుపు సాధించారు. ప్ర‌త్య‌ర్థిగా బ‌రిలో ఉన్న జునైద్ అహ్మ‌ద్ పై గ్రాండ్ విక్ట‌రీ సాధించాడు.

మ‌త ప‌ర‌మైన అంశాల‌ను ముందుకు తెచ్చినా అహ్మ‌ద్ విజ‌యాన్ని పొంద‌లేక పోయారు. ఇక రాజా కృష్ణ మూర్తి భార‌తీయ అమెరికన్ కాంగ్రెస్ లో స‌భ్యుడిగా ఉన్నారు.

ఇక ఇల్లినాయిస్ లోని ఎనిమిదో కాంగ్రెష‌న‌ల్ డిస్ట్రిక్ట్ లో రాజా కృష్ణ‌మూర్తి అత్యంత ప్రాముఖ్య‌త క‌లిగి ఉన్నారు. ఏకంగా ఆయ‌న 71 శాతానికి పైగా ఓట్ల‌తో జునైద్ అహ్మ‌ద్ ను ఓడించి స‌త్తా చాట‌రు.

కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా రాజా కృష్ణ‌మూర్తి మాట్లాడారు. విజ‌యంపై స్పందించారు. ఇల్లినాయిస్ లోని ఎనిమిదో కాంగ్రెష‌న‌ల్ డిస్ట్రిక్ట్ లోని డెమోక్ర‌టిక్ ప్రైమ‌రీ ఓట‌ర్లు కాంగ్ర‌స్ కు సంబంధించి ఎన్నిక‌ల ప్ర‌చారానికి మ‌ద్ద‌తు ఇచ్చారు.

నిర్ణ‌యాత్మ‌క ప‌ద్ద‌తిలో త‌న‌కు ఓటు వేసినందుకు ఈ సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు చెప్పారు రాజా కృష్ణ మూర్తి.

ప్ర‌ధానంగా శాంతి, పురోగ‌తి, శ్రేయ‌స్సును కోరుకుంటున్నాను. కాంగ్రెస్ లో నేను మ‌ధ్య త‌ర‌గ‌తి వారి కోసం, మ‌హిళ‌ల పున‌రుత్ప‌త్తి హ‌క్కుల కోసం , ద్ర‌వ్యోల్బ‌ణం , పెరుగుతున్న గ్యాస్ ధ‌ర‌ల‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తాన‌ని చెప్పారు.

రాబోయే రోజుల్లో ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తాన‌ని మాటిస్తున్నాన‌ని పేర్కొన్నారు రాజా కృష్ణ‌మూర్తి.

కాగా మూడు సార్లు కాంగ్రెస్ స‌భ్య‌డిగా ఉన్నారు. న‌వంబ‌ర్ 8న జ‌రిగే సాధార‌ణ ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ క్రిస్ ద‌ర్గిస్ తో త‌ల‌ప‌డ‌నున్నారు.

Also Read : బాధితుల గోడు వినాల‌ని సీజేఐకి విన్న‌పం

Leave A Reply

Your Email Id will not be published!