Ashok Gehlot Baghel : కర్ణాటకలో రాజకీయం వేడెక్కింది. మాటల తూటాలు పేలుతున్నాయి. మే 10న పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత బసనగౌడ పాటిల్ యత్నాల్ ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీపై నోరు పారేసుకున్నారు.
ఆమెను విష కన్య అని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా స్పందించింది. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ తరుణంలో పాటిల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ , రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్.
శుక్రవారం ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియాతో మాట్లాడారు. అత్యంత చవకబారు వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడంలో ఇప్పటికే చరిత్ర సృష్టించారని , రాష్ట్రంలో అధికారం కోల్పోతున్నామన్న బాధతో తమ పార్టీపై అభాండాలు వేయడం దారుణమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పాటిల్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి భాష అవమానకరమైనది. అత్యంత అభ్యంతరకరమైనదని పేర్కొన్నారు. ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు సీఎంలు గెహ్లాట్ , బాఘేల్. పీఎం సూచనలతో సీఎం బొమ్మై మద్దతుతో పాటిల్ ఇలా చేలరేగి మాట్లాడారంటూ ధ్వజమెత్తారు.
Also Read : మహిళా రెజ్లర్లకు మాలిక్ మద్దతు