RR vs LSG IPL 2022 : ఉత్కంఠ పోరాటం రాజ‌స్థాన్ విజ‌యం

3 ప‌రుగుల తేడాతో ల‌క్నో జెయింట్స్ కు షాక్

RR vs LSG : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ లన్నీ ఒక ఎత్తు. కానీ ముంబై వేదిక‌గా జ‌రిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , ల‌క్నో సూప‌ర్ జెయంట్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ మ‌రో ఎత్తు. చివ‌రి బంతి దాకా నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగింది.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్(RR vs LSG) కెప్టెన్ సంజూ శాంస‌న్ ఎత్తుగ‌డ ఫ‌లించింది. కొత్త బౌల‌ర్ దెబ్బ‌కు ల‌క్నో చేతులెత్తేసింది. ఆఖ‌రు ఓవ‌రు 19 ప‌రుగులు చేయాల్సి ఉంది. అవ‌త‌ల మోస్ట్ పాపుల‌ర్ ప్లేయ‌ర్ .

కానీ ల‌క్నో పాచిక‌లు పార‌లేదు. ఎట్ట‌కేల‌కు రాజ‌స్థాన్ దే విజ‌యం వ‌రించింది. ఐపీఎల్ కు ఉన్న మ‌జా ఏమిటో మ‌రోసారి ఈ మ్యాచ్ తో తేట‌తెల్ల‌మైంది. దీంతో రాజ‌స్థాన్ నాలుగు మ్యాచ్ లు ఆడి మూడింట్లో జ‌య‌కేత‌నం ఎగుర వేసింది.

తాను కూడా రేసులో ఉన్నాన‌ని చాటుతోంది. ల‌క్నో స్కిప్ప‌ర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్(RR vs LSG) ఆరంభంలోనే ఇక్క‌ట్లు ఎదుర్కొంది.

ర‌విచంద్ర‌న్ అశ్విన్, హెట్మెయిర్ దుమ్ము రేపారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 166 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌నలో బోర్లా ప‌డింది ల‌క్నో.

8 వికెట్లు కోల్పోయి 162 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. క్వింట‌న్ డికాక్ 39 ర‌న్స్ చేస్తే స్టోయినిస్ 38 ప‌రుగులు చేసి చివ‌రి వ‌ర‌కు ఆశ‌లు రేకెత్తించేలా చేశారు.

స్టోయినిస్ చివ‌రి దాకా ఉన్నా జ‌ట్టును గెలిపించ లేక పోయాడు. ఇక రాజ‌స్థాన్ లో యుజువేంద్ర చ‌హ‌ల్ మ‌రోసారి స‌త్తా చాటాడు. ఏకంగా 4 వికెట్లు తేశాడు. బౌల్ట్ 2, ప్ర‌సిధ్ కృష్ణ‌, కుల్దీప్ సేన్ చెరో వికెట్ తీశారు.

Also Read : వారెవ్వా వార్న‌ర్ షాన్ దార్ షా

Leave A Reply

Your Email Id will not be published!