Rajasthan Royals : అంచ‌నాలు లేకుండానే ప్లే ఆఫ్స్ కు

సంజూ మిస్ట‌ర్ కూల్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్

Rajasthan Royals : ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 కీల‌క ద‌శ‌కు చేరింది. ప్లే ఆఫ్స్ కు సంబంధించి క్లారిటీ వ‌చ్చేసింది. నాలుగు జ‌ట్లకు గాను ఇప్ప‌టికే మూడు జ‌ట్లు చేరుకున్నాయి.

తమ స్థానాల‌ను ప‌దిలం చేసుకున్నాయి. విచిత్రం ఏమిటంటే దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన 2021 ఐపీఎల్ 14వ సీజ‌న్ లో వ్య‌క్తిగ‌తంగా సంజూ శాంస‌న్ ప‌రుగుల వేట‌లో టాప్ లో ఉన్నా జ‌ట్టును విజ‌య ప‌థంలోకి చేర్చ‌లేక పోయాడు.

కానీ మేనేజ్ మెంట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దిగ్గ‌జ శ్రీ‌లంక ఆట‌గాళ్ల‌ను నియ‌మించింది. వారి ప్ర‌య‌త్నం ఫ‌లించింది. ఈసారి ఐపీఎల్

లో ఎలాంటి అంచ‌నాలు లేకుండానే ప్లే ఆఫ్స్ కు ద‌ర్జాగా చేరుకుంది రాజ‌స్తాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) టీమ్.

ప్ర‌ధానంగా ఆ జ‌ట్టు అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ స‌త్తా చాటుతూ దూసుకు పోతోంది. ఇక పాయింట్ల ప‌రంగా చూస్తే ఈసారి

కొత్త‌గా టోర్నీలో చేరిన గుజ‌రాత్ టైటాన్స్ 14 మ్యాచ్ లు ఆడి 10 మ్యాచ్ ల‌లో గెలుపొందింది.

20 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్ లో టాప్ వ‌న్ లో నిలిచింది. ఇక రెండో ప్లేస్ లో ఉన్న మ‌రో జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను వెన‌క్కి

నెట్టేసింది రాజ‌స్తాన్ రాయ‌ల్స్. 14 మ్యాచ్ లు ఆడి 9 మ్యాచ్ ల‌లో గెలుపొంది 18 పాయింట్లు సాధించింది.

ల‌క్నో కూడా 18 పాయింట్లు సాధించినా మెరుగైన ర‌న్ రేట్ లేని కార‌ణంగా మూడో స్థానానికి చేరింది. మొత్తంగా టోర్నీలో వ్య‌క్తిగ‌త ప్ర‌తిభ‌కు

ఇచ్చే ఆరెంజ్ క్యాప్ రేసులో రాజ‌స్తాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) ఆట‌గాడు జోస్ బ‌ట్ల‌ర్ 627 ప‌రుగులు చేసి టాప్ లో నిలిచాడు.

ఇక ప‌ర్పుల్ క్యాప్ రేసులో ఇదే జ‌ట్టుకు చెందిన యుజ్వేంద్ర చాహ‌ల్ అత్య‌ధిక వికెట్లు తీసి టాప్ లో నిలిచాడు. ఇక రాజ‌స్తాన్ విజ‌యాల

వెనుక మిస్ట‌ర్ కూల్ శాంస‌న్ ఉండ‌గా మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ సంగ‌క్క‌ర ఉన్నాడు.

Also Read : శాంస‌న్ బెస్ట్ ఆఫ్ ల‌క్ – ధోనీ

Leave A Reply

Your Email Id will not be published!